ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక భాషలో విడుదలై హిట్ అయిన సినిమాలను కొద్దిరోజుల గ్యాప్ తర్వాత వేరే భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఇలా గతంలో కూడా ఎన్నో సినిమాలు విడుదలవ్వడం చూశాం. ముఖ్యంగా ఏ భాషలోనైనా స్ట్రయిట్ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశాక.. సినిమా ఫలితాన్ని బట్టి డిసైడ్ అవుతుంటారు మేకర్స్. ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సీతారామం‘ విషయంలో కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు దర్శకనిర్మాతలు.
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ ని సోలో హీరోగా టాలీవుడ్ కి పరిచయం చేస్తూ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం చిత్రం.. ఆగష్టు 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక విడుదలై మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది సీతారామం. అలాగే విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తిచేసి.. కలెక్షన్స్ పరంగా డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక విడుదలైన 20 రోజుల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న సీతారామం.. హిందీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2న సీతారామం హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాబోతుండటం విశేషం. క్లాసిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దుల్కర్ సరసన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో డెబ్యూ మూవీ అయినప్పటికీ, తన నటనతో అందరినీ మెప్పించింది మృణాల్. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేశారు.
ఇదిలా ఉండగా.. సీతారామం సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేసిన ‘పెన్ స్టూడియోస్’ వారు ముందుకు రావడం మరో విశేషం. పెన్ స్టూడియోస్ వారు రిలీజ్ చేస్తుండటంతో సీతారామంపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. ఇక సీతారామం సినిమా హిందీ రిలీజ్ కోసం ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. మరి టాలీవుడ్ లో క్లాసిక్ అనిపించుకున్న సీతారామం హిందీలో రిలీజ్ అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
It’s now time for the Telugu blockbuster, #SitaRamam, to mesmerize us all in Hindi on September 2nd.#SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @jayantilalgada #PenMovies pic.twitter.com/ELc2B15kUh
— PEN INDIA LTD. (@PenMovies) August 26, 2022