హీరో సూర్య.. తన నటనతో తెలుగు, తమిళంలో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా ఓ మంచి మనసున్న వ్యక్తిగా అందరికి సుపరిచితం. నేను హీరో అనే భావన అయనలో నలుసంతైన ఎక్కడ కనిపించదు. ఎల్లప్పుడు పేద ప్రజల బాగుకోరే వ్యక్తి సూర్య అని చెప్పక తప్పదు. తన వైవిద్యమైన సినిమాల్లో పాత్రలకు ఎలాగైతే న్యాయం చేస్తాడో.. అన్నింటికి దూరంగా ఉన్న పేదవారి బాగోగులు తీర్చేందుకు సూర్య ఓ కంకణం కట్టుకున్నాడు.
ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు హీరో సూర్య పదేళ్ల క్రితం అగరం అనే ఫాండేషన్ ను స్థాపించాడు. దీని ద్వారా కష్టాల్లో నలిగిపోతూ, చదువుకు దూరంగా ఉంటూ బయట ప్రపంచం అంటే ఏంటో తెలియని అమాయకపు పేదలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తన ఫాండేషన్ ద్వారా ఇప్పటికి అనేక మంది పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న సూర్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.
ఇది కూడా చదవండి: టీషర్టు, షార్ట్‌తో హీరో సూర్య.. ఎద్దుతో రోడ్డుపై నడుచుకుంటూ..
అయితే సూర్య ప్రముఖ దర్శకుడు బాలా డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కన్యాకుమారి సముద్రతీర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఇందులో సూర్య మత్స్యకారుడిగా నటిస్తుండటం విశేషం. చిత్రీకరణలో భాగంగా సినిమాలో జాలర్లు నివసించేందుకు సహజంగా ఉండే ఇళ్లు, గుడిసెలు భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారట. ఇక చిత్రీకరణ పూర్తైన కూడా ఆ ఇళ్లను కూల్చివేయకుండా స్థానికంగా ఉండే మత్స్యకారులు ఉచితంగా ఇచ్చేందుకు సూర్య నిర్ణయం తీసుకున్నాడట. సూర్య మరోసారి మంచి మనసును చాటుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. హీరో సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.