The Choosen One: మృత్యువు.. అనేది ఎప్పుడు ఎలా ఏ రుపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అలాగే ప్రమాదాలు కూడా ఎప్పుడు ఎలా సంభవిస్తాయో చెప్పలేము. ఇటీవల ప్రశాంతంగా సాగిపోతున్న ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో.. ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకొని ఇద్దరు హీరోలు అక్కడికక్కడే మృత్యువాతపడిన వార్త బయటికి రావడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇంతకీ ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది? చనిపోయిన హీరోలు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న బ్రెజిలియన్ ఒరిజినల్ వెబ్ సిరీస్ “ది చూసేన్ వన్”. థ్రిల్లర్ సిరీస్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ 2019లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ వారు ఈ సిరీస్ ని సీజన్లుగా ప్లాన్ చేసి తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ‘ది చూసేన్ వన్’ రెండవ సీజన్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. వెంటనే మూడో సీజన్ షూటింగ్ ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో సిరీస్ లో భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండటం వలన షూటింగ్ ని.. బాజా కాలిఫోర్నియా దగ్గరలోని శాంటా రొసోలీయా ఎడారి ప్రాంతంలో ప్లాన్ చేశారు. అయితే.. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఓ రోడ్డు ఉంది. జూన్ 16న షూటింగ్ జరుగుతున్న టైంలో కాస్ట్ ని తీసుకెళ్తున్న వ్యాన్.. ఆ రోడ్డుపై నుండి ప్రమాదవశాత్తు పల్టీలు కొడుతూ షూటింగ్ సెట్ లోకి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో నటులు రేముండో గార్డునో క్రజ్, జువాన్ ఫ్రాన్సిస్కో గొంజాలెజ్ అగ్యిలర్ స్పాట్ లోనే చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఇక ఘటన నెట్ ఫ్లిక్స్ టీమ్ లో, ఇండస్ట్రీలో విషాదం నింపేసింది. ఈ విషయాన్ని జూన్ 18న రాత్రి నెట్‌ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం ‘ది చూసేన్ వన్’ మూడో సీజన్ కి బ్రేక్ పడింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Actors Raymundo Garduño Cruz and Juan Francisco González Aguilar of the upcoming Netflix series “The Chosen One” were killed during a fatal vehicle accident on Thursday.
via Page Six:
The Baja California Department of Culture also confirmed that six other crew members were… pic.twitter.com/HXdqjuGM3h
— Nael Grewther (@grewther) June 20, 2022