సినిమా చూసి అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఈ ‘సామజవరగమన’ ఛాన్స్ మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఇతనే అంటూ కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చేతిలోకి వెళ్లడం.. ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ మారిపోవడం లాంటి పరిణామాలు చాలానే జరుగుతుంటాయి. తీరా సినిమా చేతులు మారాక సెకండ్ ఛాన్స్ అనుకున్న హీరో సూపర్ హిట్ కొడితే.. ఫస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ ఇన్నర్ ఫీలింగ్ మామూలుగా ఉండదు. ఇప్పుడలానే రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో గురించిన న్యూస్ వైరల్ అవుతోంది. చేసే ప్రతి సినిమాకీ వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు.. కామెడీనే ప్రధానంగా నమ్ముకుని చేసిన హిలేరియస్ ఎంటర్‌టైనర్.. ‘సామజవరగమన’. రెబా మోనికా జాన్ హీరోయి. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా.. అనిల్ సుంకర సమర్పణలో, రాజేష్ దండు నిర్మించారు.
రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు. విడుదలకు రెండు రోజుల ముందే ప్రివ్యూ వేసి, ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షనుల నుండి కూడా పాజిటివ్ టాక్ దక్కించుకుందీ చిత్రం. ఇక మౌత్ టాక్‌తో థియేటర్లు, కలెక్షన్స్, ఓవర్సీస్ వసూళ్లు పెంచుకుంటూ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ రూ.30.1 కోట్ల గ్రాస్ రాబట్టి, విజయవంతంగా 2వ వారంలోకి ఎంటర్ అయింది. ఇక యూఎస్‌లోనూ 1 మిలియన్ మార్క్ టచ్ చేయడానికి అతి దగ్గర్లో ఉంది. సినిమా చూసి అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఈ ‘సామజవరగమన’ ఛాన్స్ మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరో ఇతనే అంటూ కొన్ని వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
అతనెవరో కాదు, సందీప్ కిషన్. సందీప్, సత్య, సుదర్శన్ మెయిన్ లీడ్స్‌గా చేసిన ‘వివాహ భోజనంబు’ మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యాడు రామ్ అబ్బరాజు. పాండమిక్ కారణంగా ఓటీటీలో రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ దక్కించుకుందీ చిత్రం. ఇక నిర్మాతగానూ సందీప్ కిషన్‌కి మంచి లాభాలు వచ్చాయి. ముందుగా ఈ ‘సామజవరగమన’ కూడా తనతోనే చేయాలనుకున్నాడు రామ్. కట్ చేస్తే.. ‘మైఖేల్’ అనే పాన్ ఇండియా ఫిలింతో బిజీగా ఉండడంతో ఈ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఆ మూవీ రిజల్ట్ ఏంటో తెలిసిందే. అతగాడు మిస్ అయిన మూవీతో శ్రీ విష్ణు సాలిడ్ సూపర్ హిట్ అందుకున్నాడు.