ఇండస్ట్రీలో ప్రస్తుతం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దూసుకుపోతున్నాడు. అయితే.. తమన్ పెద్ద స్టార్స్ తో పనిచేసినా, ఎంత బిజీగా ఉన్నా తనను ఆదరించిన వారికోసం టైమ్ కేటాయిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన కళావతి సాంగ్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలో తమన్.. తనకు కెరీర్ పరంగా లైఫ్ ఇచ్చి, పని కల్పించి అన్నం పెట్టిన దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. చక్రి సోదరుడు మహిత్ ప్రారంభించనున్న ‘సి స్టూడియోస్.. సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డా’ లోగో లాంచ్ చేశాడు తమన్. చక్రి పేరుతో స్టూడియో స్టార్ట్ చేయడం పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తాను బాచీ నుండి దేవదాస్ సినిమా వరకు చక్రి దగ్గర పని చేశానని తమన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ స్టూడియోకి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని చెప్పాడు. ప్రస్తుతం తమన్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.