ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ హవా నడుస్తోంది. తాను పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వరుస మ్యూజికల్ హిట్స్ తో తమన్ జోరు కొనసాగిస్తున్నాడు. సూపర్ స్టార్, మెగాస్టార్ నుండి ఇండస్ట్రీలో పెద్ద సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట‘ సినిమాకి కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్.
ఇటీవలే ఈ సినిమా నుండి ‘కళావతి‘ లిరికల్ సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కళావతి పాటలో మహేష్ చేసిన హుక్ స్టెప్స్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఆ స్టెప్స్ తో రీల్స్ చేస్తున్నారు. అయితే.. తాజాగా కళావతి పాటకు తమన్ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి తమన్ కళావతి స్టెప్పులు ఇరగదీశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి తమన్ డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.