ప్రస్తుతం దక్షిణాదిలో దళపతి విజయ్ ఫీవర్ నడుస్తోంది. విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’.. ఏప్రిల్ 13న విడుదలకు రెడీ అవుతుండటంతో ఫ్యాన్స్ లో హైప్ మామూలుగా లేదు. విజయ్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడు థియేటర్ల వద్ద పెద్ద జాతర వాతావరణాన్ని తలపిస్తుంది. చివరిగా విడుదలైన మాస్టర్ సినిమా కూడా విజయ్ కెరీర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా హిట్ ప్రభావంతో పాటు బీస్ట్ ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ సినిమాపై భారీ అంచనాలకు కారణమయ్యాయి.
ఇక బీస్ట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే విజయ్.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ సినిమా ఓకే చేశాడు. ఈ క్రమంలో తాజాగా విజయ్ – దిల్ రాజు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీని చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా ఖరారైంది.
ఏకకాలంలో తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా లేటెస్ట్ పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పూజ సమయంలో హీరోయిన్ రష్మిక.. సందడిగా కనిపిస్తోంది. విజయ్ తో కలిసి ఫోటోలకు వెరైటీ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలలో విజయ్ – రష్మికల జోడి అదిరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి విజయ్ – రష్మిక జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.