హీరోల పుట్టినరోజు వేడుకను పండుగగా చేసుకుంటారు. ఈ తరహా ఆనందాల నేపధ్యంలో పుట్టినరోజు సందర్భంగా హీరోల కామన్ డీపీలు విడుదలవు తుంటాయి. తమిళ స్టార్, ఇళయ దళపతి విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేశారు. తమిళ హీరో విజయ్ ఈ నెల 22న పుట్టినరోజున ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మాస్టర్’ సూపర్‌హిట్ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విశేషం ఏమిటంటే ఆ పోస్టర్‌లో విజయ్ నటించిన 64 చిత్రాలకు సంబంధించిన విజయ్ ముఖ చిత్రాలను పొందుపరిచారు. ప్రస్తుతం విజయ్ 65వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
వంశి పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా తెలుగులో తొలిసారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న 65వ సినిమా ఇది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ విజయ్‌తో జతకడుతోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. దళపతి కొత్త సినిమాకి ‘బీస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హ్యాష్ ట్యాగ్స్‌తో విజయ్ ‘బీస్ట్’ ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘బీస్ట్’ త్వరలో విడుదల కానుంది.
Wishing the #BEAST of Kollywood #ThalapathyVijay a very Happy Birthday!
Here is #BeastSecondLook!
#HBDThalapathyVijay #HappyBirthdayThalapathyVijay #HBDThalapathy@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja pic.twitter.com/E9RzGDpFwP— Sun Pictures (@sunpictures) June 21, 2021