ఇళయదళపతి విజయ్ – నిర్మాత దిల్ రాజు కాంబోలో వచ్చిన చిత్రం ‘వరిసు’. తెలుగులో ఈ సినిమాను ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ తమిళంలో మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను కొల్లగొడుతోంది. తెలుగులోనూ మంచి స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘వారసుడు’ మూవీ.. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఇంకా అది సరిపోదట. దీంతో ప్రమోషన్లను మరింతగా పెంచాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని తన ఇంట్లో సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారట. ఈ పార్టీ కోసం హీరో విజయ్.. చెన్నై నుంచి హైదరాబాద్ రాబోతున్నారని సమాచారం.
దిల్ రాజు ఇంట్లో జరగనున్న సక్సెస్ పార్టీకి ‘వారసుడు’ టీమ్‌లోని ముఖ్యులంతా హాజరవ్వనున్నారట. మూవీలో హీరోయిన్‌గా నటించిన రష్మికా మందన్న కూడా ఈ పార్టీలో సందడి చేయనున్నారని సమాచారం. ఈ పార్టీకి రానున్న విజయ్ ప్రెస్‌మీట్‌లోనూ పాల్గొంటారట. ప్రెస్‌మీట్ ద్వారా ‘వారసుడు’ సినిమాను తెలుగు ఆడియెన్స్‌లోకి మరింతగా తీసుకెళ్లేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
ఇకపోతే, విజయ్ 66వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వారసుడు’ విజువల్ పరంగా బాగుందని ప్రశంసలు అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్‌కు తండ్రిగా సీనియర్ నటుడు శరత్ కుమార్ నటించారు. దళపతికి అన్నలుగా శ్రీకాంత్, కిక్ శ్యామ్ యాక్ట్ చేశారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే కథగా ‘వారసుడు’ రూపొందింది. మరి, సక్సెస్ పార్టీ, దళపతి విజయ్‌తో ప్రెస్‌మీట్ పెట్టడం ద్వారా ప్రేక్షకులను ‘వారసుడు’ టీమ్ ఏమేరకు ఆకట్టుకుంటుందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.