తమ అభిమాన హీరోకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లు ఫ్యాన్స్ తో తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నారు. ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంటున్నారు. ఇటీవల స్టార్లకు సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మాద్యమాల్లో షేరు చేయడం కామన్ అయ్యింది. అలాంటివి కనిపిస్తే చాలు ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోకి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు నెట్టింట్ తెగ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో మాస్ హీరోగా విపరీతమైన క్రేజ్ ఉంది.
ఆ హీరో ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరో విజయ్. ముద్దుగా ఫ్యాన్స్ ఆయనను తలపథి అంటారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ దంపతులకు జన్మించాడు విజయ్. ఆయన తండ్రి తమిళ నాట ప్రముఖ దర్శకులు, తల్లి శోభ సినిమా నేపథ్యగాయని. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో పెరిగిన విజయ్ కి నటుడు కావాలనే ఆశ ఉండేది. ఈ క్రమంలోఆయన తండ్రి దర్శకత్వం వహించిన “వెట్రి” చిత్రంలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత తన తండ్రి దర్శకత్వంలోనే “నాలయ తీర్పు” చిత్రంతో హీరోగా మారాడు. తర్వాత ఎన్నో మాస్ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ హీరోగా మారాడు విజయ్.
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్. గత కొంత కాలంగా ఆయన నటిస్తున్న ప్రతి చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి. ఆయన నటించిన మూవీస్ పై ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. కలెక్షన్లు కూడా బాగా రాబడుతున్నాయి. తాజాగా విజయ్ తన తల్లి శోభతో కలిసి ఉన్న ఒక ఫోటో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగ, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.