గతేడాది మాస్టర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించిన తమిళ స్టార్ దళపతి విజయ్ నుండి కొత్తగా వస్తున్న సినిమా ‘బీస్ట్‘. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ టైం దళపతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది. డాక్టర్ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. బీస్ట్ మూవీని తెరకెక్కించాడు.
తాజాగా బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. బీస్ట్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ స్పై(రా ఏజెంట్)గా కనిపించనున్నాడు. చెన్నైలోని కోస్టల్ ఏరియాను ఆక్రమించిన టెర్రరిస్ట్ లను ఎలా మట్టి కురిపించాడు అనే స్టోరీ లైన్ తో సినిమా రూపొందినట్లు తెలుస్తుంది. విజయ్ లో డిఫరెంట్ వేరియేషన్స్ కాప్చర్ చేశారు.
ఇక సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ట్రైలర్ లో సాంగ్స్ అయితే చూపించలేదు కానీ బ్యాక్ గ్రౌంగ్ మ్యూజిక్ చాలా క్యాచిగా ఉంది. ఇక హీరోయిన్ పూజా క్యారెక్టర్ కూడా పెద్దగా రివీల్ చేయలేదు. ఇద్దరు సక్సెస్ లో ఉన్న కాంబినేషన్ లో సినిమా కాబట్టి సినిమా పై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. మరి బీస్ట్ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.