Thalapathy66: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మొదటిసారి ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ‘వారిసు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా విజయ్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని రివీల్ చేశారు. ప్రస్తుతం విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ పోస్టర్ లో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూల్ మార్క్ కనిపిస్తోంది. అటు క్లాస్ ఆడియెన్స్ ని ఇటు మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలాసినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక వారిసు పదానికి తెలుగులో వారసుడు అని అర్థం వస్తుంది. మొత్తానికి విజయ్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ ని గుర్తుంచుకొని నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
ఇక విజయ్ ఆ సూట్‌లో అలా పొగరుగా చూస్తుంటే.. విలన్ల తాట తీసేందుకు రెడీగా ఉన్నట్టు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కాగా.. శరత్ కుమార్, కిక్ శ్యామ్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి దళపతి 66వ సినిమాగా రాబోతున్న వారిసు ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Varisu pic.twitter.com/b2bwNNAQP8
— Vijay (@actorvijay) June 21, 2022