కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇళయదళపతి విజయ్. అద్భుతమైన నటన, మెసేజ్ ఓరియేంటెడ్ చిత్రాలు చేయడం, అభిమానులతో మమేకం కావడం లాంటి అంశాలతో విజయ్ మంచి క్రేజ్ వచ్చింది. తమిళనాట కాకుండా తెలుగు ఇండస్ట్రీలోను విజయ్ కి అభిమానులు ఉన్నారు. తన అభిమానులకు తరచూ గుడ్ న్యూస్ చెప్పే విజయ్.. తాజాగా మరో శుభవార్త చెప్పారు.
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇళయదళపతి విజయ్. అద్భుతమైన నటన, మెసేజ్ ఓరియేంటెడ్ చిత్రాలు చేయడం, అభిమానులతో మమేకం కావడం లాంటి అంశాలతో విజయ్ మంచి క్రేజ్ వచ్చింది. తమిళనాట కాకుండా తెలుగు ఇండస్ట్రీలోను విజయ్ కి అభిమానులు ఉన్నారు. ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియాలో లేరు. అయితే ఈ విషయంపై ఎప్పటి నుంచో అభిమానుల్లో అసంతృప్తి ఉంది. అయితే తన అభిమానులకు విజయ్ శుభవార్త చెప్పారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన విజయ్..తనకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ అభిమానులను పలకరించారు.
నేటికాలంలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలకు చెందిన వారు సోషల్ మీడియాలో ఉంటారు. చోటామోటా హీరోలు, హీరోయిన్లు అయితే నెట్టింట్లో చేసే హల్ చల్ అంతా ఇంతా కాదు. తమకు సంబంధించిన ఫోటోలను, ఇతర విషయాలను ఇన్ స్టా గ్రామ్ , ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటారు. తమకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటారు. అలానే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం సోషల్ మీడియా ద్వారా తమకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు.
ఇలా దాదాపు సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన చోటా ఆర్టిస్ట్ ల నుంచి బడా హీరోల వరకు అందరూ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో టచ్ లో ఉండారు. ఈ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు మాత్రం చాలా నిరాశగా ఉన్నారు. తమ హీరో సోషల్ మీడియాలోకి రావడంలేదని వారిలో అసంతృప్తి ఉంది. అయితే వారి అసంతృప్తి.. చేరిపేస్తూ విజయ్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇప్పటి వరకు ఇన్ స్టా గ్రామ్ లో లేని విజయ్.. తాజాగా అకౌంట్ ఓపెన్ చేశాడు. తనకు సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను పలకరించాడు. ఫోటో షేర్ చేసిన గంటలోనే విజయ్ అకౌంట్ హ్యాండిల్ కు ఆరు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు.
ఇటీవలే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమాతో విజయ్ ప్రేక్షకులను పలకరించాడు. అలానే ప్రస్తుతం విజయ్ లియో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలానే మరో ప్రధాన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలై లియో ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. విడుదలైన లియో మూవీ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరి.. ఎంతోకాలం నుంచి సోషల్ మీడియాలో లేని స్టార్ హీరో విజయ్.. తాజాగా ఇన్ స్టాలోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.