బంపర్ ఆఫర్.. వారికి ఆదిపురుష్ మూవీ టికెట్స్ ఉచితం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంది. జూన్ 16న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత మూవీ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగా టికెట్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ప్రభాస్.. ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసి అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. ప్రభాస్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుంటారు. అయితే తాజాగా ఆయన నటించిన ఆదిపురుష్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా నిర్మాత టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. రామాయణాన్ని ఇప్పటితరానికి పరిచయం చేస్తూ, ప్రస్తుత టెక్నాలజీని ఉపమోగిస్తూ విజువల్ వండర్ గా తెరకెక్కించారు. జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. 10వేలకు పైగా సినిమా టికెట్స్ ప్రీగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ‘ఈ జూన్ లో అత్యంత గొప్ప వ్యక్తిని స్మరించుకుందా. మర్యాద పురుషోత్తముని స్మరించుకుందాం.

ఆదిపురుష్ వేడుకలు జరుపుకుందాం. శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకోవాలి, అయన దివ్వ అడుగుజాడలను అనుసరించాలి. మునుపెన్నడూ లేని అనుభూతిలో మునిగి పోదాం’ అని దీని కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు 10వేల+ టికెట్లు ఫ్రీగా అందిస్తారు. ఇందుకోసం గూగుల్ ఫాం ఫిలప్ చేసి నమోదు చేసుకుంటే టికెట్లు పంపుతామని ప్రకటించారు.

 

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed