హీరో, హీరోయిన్లు మొదలుకుని ఇతర ఆర్టిస్టులు వరకు అందరూ తమదైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అమ్మ, వదిన, అత్త వంటి పాత్రలు అనగానే కొందరు నటీమణులు మాత్రమే ఠక్కున గుర్తుకు వస్తారు. అలా తమదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటి రోహిణి ఒకరు. ఎప్పుడు చీరలో కనిపించే రోహిణి.. మోడ్రన్ డ్రెస్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.
సినిమాల ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించారు. హీరో, హీరోయిన్లు మొదలుకుని ఇతర ఆర్టిస్టులు వరకు అందరూ తమదైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అమ్మ, వదిన, అత్త వంటి పాత్రలు అనగానే కొందరు నటీమణులు మాత్రమే ఠక్కున గుర్తుకు వస్తారు. అలా తమదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటి రోహిణి ఒకరు. ఆమెను ఏ సినిమాలో చూసినా చీరలోనే కనిపిస్తారు. అలా చీర కట్టులే కనిపించే రోహిణిని చాలా అరుదుగా మాత్రమే ఇతర డ్రెస్ లో కనిపిస్తుంది. ఇటీవలే మోడ్రన్ డ్రెస్ లో రోహిణి గుర్తు పట్టలేని విధంగా కనిపించారు. ఆ డ్రెస్ లో ఆర్య సినిమాలోని పాటకు ఆమె డ్యాన్స్ సైతం చేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీనియర్ నటి రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా, టీవీ యాంకర్, రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సినీ ఇండస్ట్రీకి బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అతి తక్కువ కాలం లో మంచి గుర్తింపు పొందారు. బాలనటి ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తరువాత హీరోలకు సోదరి పాత్రలో చేసింది. కొన్ని సినిమాలో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించారు. ఒకవైపు నటిగా కొనసాగుతూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారు.
ప్రముఖ నటుడు రఘువరణ్ ను ప్రేమించి రోహిణి పెళ్లాడింది. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడు సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు. తెలుగు , తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో తల్లిగా, అత్తగా.. ఇతర ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆమె అనేక సామాజిక కార్యక్రమాలో పాల్గొన్నారు. తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్ ఫిల్మ్స్‌కు ఆమె డైరెక్షన్ చేశారు.
అంతేకాకుండా సామాజిక అంశాలను ప్రతిబింబించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించింది. ఇక రోహిణి ఏ సినిమాల్లో చూసిన చీరకట్టులోనే కనిపిస్తారు. సంప్రదాయ వస్త్రాలతో కనిపించే సెలబ్రిటీల్లో రోహిణి ఒకరు. అలాంటి ఆవిడ తాజాగా మోడ్రన్ డ్రెస్ లో కనిపించారు. అసలు రోహిణినే అనేంతలా గుర్తు పట్టకుండా ఉన్నారు. ఆ మోడ్రన్ డ్రెస్ ధరించిన రోహిణి.. డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆర్య సినిమాలోని “ఏదో ప్రియరాగం వింటున్నా” అనే సాంగ్ మ్యూజిక్‌కి ఆమె కాలు కదిపారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు చీరలో కనిపించే రోహిణి.. ఒక్కసారిగా మోడ్రన్ డ్రెస్ లో కనిపించే సరికి అందరూ షాకయ్యారు. అలానే సడెన్ గా ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టన్ అవుతున్నారు. ఆ తరువాత తేరుకుని.. డ్యాన్స్ సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ల కంటే మీరే బాగా డ్యాన్స్ చేస్తున్నారు మేడమ్ అంటూ మరికొందరు ఆమెపై ప్రశంసలు కురిపించారు. మరి.. ఈ వీడియోపై మీరు ఓ లుకేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.