తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1 నుంచి టాలీవుడ్ అగ్రహీరోల సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఇవాళ సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సినిమాల షూటింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటీటీల్లో సినిమాల విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న ఇతర సమస్యలపై కొంతకాలంగా జరుపుతున్న చర్చలతో పరిష్కారం లభించకపోవడంతో నిర్మాతల గిల్డ్ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.