Vijay: సౌత్‌లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ఒకరు. తమిళంలో నెంబర్ వన్ పొజిషన్ కోసం ఆయన పోటీ పడుతున్నారు. ఇక, తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఆయన నటనకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, గత కొన్ని రోజుల నుంచి విజయ్‌పై విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఓ తెలుగు స్టార్ హీరో ఫ్యాన్స్‌తో పాటు కొందరు తెలుగు మీమర్స్‌తో ఆయనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విమర్శిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. విజయ్ కొన్ని తెలుగు సినిమా రీమేక్స్‌తో తమిళంలో భారీ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
వాటి కారణంగా కూడా ఆయన స్టార్‌డమ్ పెరిగిందని చెప్పొచ్చు. మాతృకలో తమ హీరో నటనను, రీమేక్‌లో విజయ్ నటనను పోలుస్తూ తెలుగు స్టార్ హీరో ఫ్యాన్స్ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. విజయ్‌కి యాక్టింగ్ రాదంటూ.. ఏ ఎమోషన్‌కైనా ఒకే ఎక్స్‌ప్రెషన్ పెడుతున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక, విజయ్ ఫ్యాన్స్ కూడా ‘‘మేమేం తక్కువ తిన్నామా’’ అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. తెలుగు స్టార్ హీరోపై ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది.
రెండు రోజుల ముందు వరకు కొన్ని హ్యాష్ ట్యాగులు నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే, తెలుగు ఫ్యాన్స్, మీమర్స్ ఒకడుగు ముందుకు వేశారు. ఏ సంఘటనా జరిగినా దాన్ని విజయ్‌కి లింక్ చేస్తూ ట్రోల్స్ చేయటం మొదలుపెడుతున్నారు. మొన్న వరదలు వచ్చినపుడు.. నిన్న ఇండియా ఓడిపోయినపుడు ఇలా అన్నింటికి విజయే కారణం అంటూ ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. మరి, విజయ్‌పై తెలుగు స్టార్ హీరో ఫ్యాన్స్, మీమర్స్ ట్రోలింగ్స్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Andharu ee 3 tags ni use cheyyandi 🤙#NationalTrollMaterialVijay#BoycottLesbianVijay#BoycottGayVijayFromIFI
— బ్రహ్మానందం (@theBrahmanandam) September 5, 2022
Expression king Vijay anniya 🔥#BoycottLesbianVijay#NationalTrollMaterialVijay pic.twitter.com/PXsxtCJSAO
— Kim Babai (@Kimbabai_999) September 5, 2022
Those intensity in eyes 💥🥵 #NationalTrollMaterialVijay pic.twitter.com/KXvSaqXWxV
— च🏃🏻 (@kinguuu_naidu) September 5, 2022
ఇవి కూడా చదవండి : Samrat: మొదటిసారి కూతురి ఫేస్ రివీల్ చేసిన బిగ్ బాస్ సామ్రాట్!