SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Telugu Legendary Director Vittalacharya

గ్రాఫిక్స్ లేని రోజుల్లో విఠలాచార్య అన్ని అద్భుతాలు ఎలా చేశారు?

    Published Date - Sun - 15 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
గ్రాఫిక్స్ లేని రోజుల్లో విఠలాచార్య అన్ని అద్భుతాలు ఎలా చేశారు?

తెలుగు కళామతల్లి సైతం గర్వించ దగ్గ సినిమా దర్శకులు చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారి వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కింది. తెలుగు సినిమాకు సినిమా చరిత్రలో చెరిగిపోని చోటు దక్కింది. అలా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శకుల్లో నాటి, మేటి దర్శకుడు విఠలాచార్య పేరు ఇప్పటికీ, ఎప్పటికీ చరితార్థమే. 1992 వరకు ఈయన సినిమాలంటే ప్రేక్షకులు ప్రాణం ఇచ్చేవారు. విఠలాచార్య సినిమాలు ఇప్పుడు టీవీలో వచ్చినా టీవీలకు అతుక్కుపోవటం పరిపాటి. ఆయన సినిమాకు కొత్త హంగులు దిద్దారు. ప్రేక్షకులను తన సినిమా నైపుణ్యం, పనితనంతో కొత్త లోకాలకు తీసుకెళ్లారు.

మాతృ భాష కన్నడ.. తెలుగు మీద మమకారంతో..
విఠలాచార్య తెలుగు వ్యక్తి కాదు. ఆయనది కర్ణాటక. ఒకప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వంలోని ఉడిపిలో ఓ ‍బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుంచి డ్రామాలు, యక్షగానం మీద ఆసక్తి చూపేవారు. పెద్దయ్యాక స్నేహితులతో మైసూర్‌ వెళ్లారు. అక్కడ వారితో ఓ సినిమా ప్రొడక్షన్‌ కంపెనీని మొదలుపెట్టారు. తర్వాత 1953లో సొంతంగా ఓ కంపెనీని మొదలుపెట్టారు. ‘‘రాజ్య లక్ష్మి’’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించటం విశేషం. ఓ మూడు సినిమాలు తీసిన తర్వాత మద్రాస్‌కు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన తర్వాతి నుంచి తెలుగు సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ఆయన మాతృ భాష కన్నడలో కూడా తియ్ననన్ని సినిమాలు తెలుగులో తీశారు. ఆయన చివరి సినిమాను కూడా  తెలుగులోనే తీశారు.

జానపద బ్రహ్మ.. గ్రాఫిక్స్‌ లేని కాలంలో అద్భుతాలు..
ఆయన సినిమాలు చేసే కాలానికి గ్రాఫిక్స్‌ లేవు.. ఒక వేళ ఉన్నా ఆ గ్రాఫిక్స్‌ను ఉపయోగించి సినిమాలు చేసే స్థాయి తెలుగు సినిమాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా విఠలాచార్య అద్భుతాలను సృష్టించారు. కేవలం కెమెరా టెక్నిక్‌లు, మూమెంట్లతో అద్భుతాలను చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ ఉండి కూడా చేయలేకపోతున్న దాని బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలోనే ఆయన చేశారు. మాయలు, మంత్రాలు, దెయ్యాలు, బూతాలతో జనాల్ని పిచ్చపిచ్చగా మెప్పించారు. జానపద సినిమాల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. జానపద బ్రహ్మగా తెలుగు ప్రజలతో కీర్తించబడ్డారు. తమిళంలో మాయాజాల మన్నన్‌గా మెప్పుపొందారు.

1980లలోనే త్రీడీ సినిమా.. దెయ్యాల సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌
అప్పుడప్పుడే కలర్‌ సినిమాలు తెలుగులో ఊపందుకుంటున్నాయి. ఒకరకంగా కలర్‌లో సినిమా చేయటం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి సమయంలో విఠలాచార్య ఓ కొత్త ప్రయోగానికి తెరతీశారు. తెలుగులో తొలి త్రీడీ సినిమాను తీయటంలో భాగమయ్యారు. 1984 జై బేతాళ అనే త్రీడీ సినిమాను తీశారు. అయితే, ఈ సినిమాకు స్టోరీని, స్క్రీన్‌ ప్లేను మాత్రమే విఠలాచార్య అందించారు. ఇక, విఠలాచార్య సినిమా అంటే పిశాచాలు, దెయ్యాలు గుర్తుకు వస్తాయి. మదన మోహిని, జగన్మోహిని, మోహినీ శపథం వంటి సినిమాలతో అప్పటి ప్రేక్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఈ సినిమాలలో తెల్ల దుస్తుల్లో ఉండే పిశాచాలు, దెయ్యాల గెటప్‌లు చాలా ఫేమస్‌ అయ్యాయి. దెయ్యాలు అంటే ఇలానే ఉంటాయేమో అనుకునేలా గెటప్‌లను తయారు చేశారు.

Vittalacharya old graphics movies

 విఠలాచార్య ఉంటే ఆస్కార్‌ వచ్చేది! 
ఇప్పుడు గ్రాఫిక్స్‌ ఉపయోగించి రాజమౌళి చేస్తున్న వండర్స్‌ 30 ఏళ్ల క్రితమే విఠలాచార్య చేశారు. 1992లో ఆయన చివరి సినిమా వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన సినిమాలకు దూరం అయ్యారు. 1999లో తుదిశ్వాస విడిచారు. ఒకవేళ ఆయన బతికుండి సినిమాలు తీస్తూ ఉండి ఉంటే.. తెలుగుకు ఎప్పుడో ఓ 20 ఏళ్ల క్రితమే ఓ ఆస్కార్‌ కచ్చితంగా వచ్చేది అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. సినిమాలు చేసినంత కాలం ఆయన హాలీవుడ్‌ డైరెక్టర్‌లకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాలు చేశారు. తన సినిమాలను మొత్తం ప్రయోగాలకు వేదికగా చేశారు. ప్రతీ సినిమాలో ఓ కొత్త దనాన్ని జొప్పించారు.

Tags :

  • Movie News
  • tollywood
  • Vittalacharya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐ లవ్ నాగచైతన్య.. చాలా బాగుంటాడు: హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

ఐ లవ్ నాగచైతన్య.. చాలా బాగుంటాడు: హీరోయిన్ దివ్యాంశ కౌశిక్

  • నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

    నన్ను ట్రాప్ చేశాడు.. నాకు పెళ్లైందని చెప్పినా అతను వినలేదు: టీవీ నటి

  • ఎవరి వల్లా కాని పని చిరంజీవి వల్ల అయ్యింది: గుమ్మడి కూతురు శారద

    ఎవరి వల్లా కాని పని చిరంజీవి వల్ల అయ్యింది: గుమ్మడి కూతురు శారద

  • సుహాస్ వాళ్ళని గుర్తుపెట్టుకుని మరీ సెటిల్ చేస్తున్నాడు: నిర్మాత శరత్ చంద్ర

    సుహాస్ వాళ్ళని గుర్తుపెట్టుకుని మరీ సెటిల్ చేస్తున్నాడు: నిర్మాత శరత్ చంద్ర

  • ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా?.. బాలయ్య పక్కన రెండు సినిమాలు చేసింది!

    ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా?.. బాలయ్య పక్కన రెండు సినిమాలు చేసింది!

Web Stories

మరిన్ని...

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు
vs-icon

తెలుగు తెరకు పరిచయం అవుతోన్న కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్ గురించి కొన్ని విషయాలు

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..
vs-icon

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి మృతిలో ట్విస్ట్‌.. గుండెపోటుతో పాటు..

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!
vs-icon

పింక్ ఫ్రాక్ లో పాలపుంతలా మెరిసిపోతున్న యాంకరమ్మ!

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
vs-icon

పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

తాజా వార్తలు

  • ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకులు ప‌ని చేసేది 18 రోజులే.. సెలవుల జాబితా ఇదే..!

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • ఆర్థిక సంక్షోభం వేళ.. మంత్రి పదవి దక్కించుకున్న పాక్ బౌలర్ వహాబ్ రియాజ్‌..

  • 5 నిమిషాలు గడిచాక అంపైర్ నిర్ణయం.. గొడవకు దిగిన పాక్-బంగ్లా ఆటగాళ్లు..!

  • ఎవరు దిష్టి పెట్టారో.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం: అదిరే అభి

  • గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడి.. రూ.50 లక్షల కారును తగలబెట్టిన డాక్టర్

  • హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం.. సినీ రచయిత సహా 8 మంది అరెస్ట్..!

Most viewed

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

  • హర్షసాయికి ఏమైంది? 5 నెలలుగా ఒక్క వీడియో పోస్ట్ చేయలేదు!

  • జియాగూడ యువకుడి హత్య కేసు.. అతడిని నరికి చంపింది ఎవరో కాదు!

  • తిరుమలలో డ్రోన్ ఎగరేసిన కిరణ్ పై నమోదు చేసిన కేసుల వివరాలు..!

  • ఓటీటీ స్పెషల్ ధమాకా.. ఈ వారం 20 చిత్రాలు రిలీజ్!

  • హీరోపై పిచ్చితో.. ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశా: రష్మిక మందాన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam