Singer Vagdevi: ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ లో యువగాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఫినాలేలో వాగ్దేవి తన గాత్రంతో న్యాయనిర్ణేతలతో పాటు వచ్చిన ముఖ్యఅతిథి మెగాస్టార్ చిరంజీవిని, స్పెషల్ గెస్టులు రానా, సాయిపల్లవిని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సంగీత ప్రియులను మెప్పించి ట్రోఫీని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి కూడా అందుకున్న వాగ్దేవి.. ఆ వెంటనే గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఓ సినిమాలో పాట పాడే అవకాశం చేజిక్కించుకుంది. ఆ తర్వాత చిరంజీవి తన ‘గాడ్ ఫాదర్’ మూవీలో వాగ్దేవికి పాట పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ప్రముఖ సింగర్ కార్తీక్ తాను సంగీతం అందించే తదుపరి చిత్రంలో వాగ్దేవికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.
అగ్ర సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యా మీనన్, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా, సింగర్ శ్రీ రామ్‌చంద్ర హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన యువ గాయకుల మధ్య ఆరంభం నుంచి మంచి పోటీ నడిచింది. ఆసక్తికరంగా సాగిన ఫినాలే ఎపిసోడ్ కు చిరంజీవితో పాటు ‘విరాట పర్వం’ జంట రానా, సాయిపల్లవి కూడా హాజరై సందడి చేశారు.
ఇక తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన వాగ్దేవి సుమన్ టీవీతో ఇంటర్వ్యూలో పాల్గొంది. తాను మెగాస్టార్ చేతుల మీదుగా ట్రాఫ్య్ అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన వాగ్దేవి.. తన సింగింగ్ కెరీర్ గురించి షేర్ చేసుకుంది. అలాగే వాళ్ళమ్మ కారణంగానే ఈరోజు సింగర్ గా గుర్తింపు పొందానని, ఆ ట్రోఫీని ఆమెకు అంకితం చేస్తున్నట్లు చెప్పింది. అలాగే తనకు ఇష్టమైన సింగర్ చిత్ర అని.. ఫేవరేట్ హీరోహీరోయిన్స్ అల్లు అర్జున్, కీర్తిసురేష్ అని చెప్పుకొచ్చింది వాగ్దేవి. ప్రస్తుతం వాగ్దేవి ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. మరి వాగ్దేవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.