సమాజంలో ఎన్ని తరాలు మారినా.. ఎన్నేళ్లు గడిచినా.. ప్రతిసారి బాధించబడుతోంది సామాన్యుడు మాత్రమే. సామాన్యులు ఇప్పటికీ ఎందుకని మంచి రోజులొస్తాయనే ఎదురుచూపుల్లోనే జీవితాలను ముగిస్తున్నారు. ఎవరు ఈ సామాన్యులకు న్యాయం చేసేది..? ఎవరు ఈ సామాన్యుల కన్నీటి గాథలకు సమాధానం చెప్పేది..? అసలు సామాన్యుల కష్టాలను ఆలకించేవారెవరు? అంటే.. సామాన్యుల కష్టాలను వినేందుకు సుమన్ టీవీ ముందుకు వస్తోంది.
సామాన్యుడితోనే సుమన్ టీవీ అంటూ.. ప్రముఖ యాంకర్ జాఫర్ హోస్ట్ గా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ లో భాగంగా ప్రముఖ హీరోయిన్.. తను పడ్డ కష్టాలు చెబుతూ.. తను పడుపు వృత్తిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయాలను షేర్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో రూపంలో తెలియజేయండి.