ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు, ప్రముఖ దర్శక, నిర్మాతలు కన్నుమూశారు. తాము ఎంతగానో ఇష్టపడే నటీనటులు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు దుఖఃంలో మునిగిపోతున్నారు.
గత కొంత కాలంగా భాషకు సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక రంగానికి చెందిన వారితో పాటు వారి బంధువులు కన్నుమూస్తున్నారు. గత ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటులు, దర్శకులు కన్నుమూశారు. తాము ఎంతగానో అభిమానించే సినీ నటులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఫిలిమ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు కొమరం వెంకటేష్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మద్య దగ్గుబాటి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. తాజాగా తెలుగు ఫిలిమ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కొమరం వెంకటేష్ కన్నుమూశారు. కొంతకాలంగా కొమురం వెంకటేష్ అనారోగ్యంతో సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుక్రవారం రాత్రి చనిపోయినట్లు తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి ట్విట్టర్ లో వెల్లడించింది. ఆయన కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలైంది.. తర్వా ఫిలిం ఫెడరేషన్ కు ప్రెసడెంట్ గా గెలుపొంది సేవలు అందించారు.
గతంలో నందమూరి కళ్యాన్ రామ్ నటించిన ‘షేర్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు కొమురం వెంకటేష్. ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న కొమురం నిర్మాత స్థాయికి ఎదిగారని.. అందరితో మంచి స్నేహసంబంధాలు కొనసాగించేవారని.. చిన్న వయసులోనే ఇలా బ్రేయిన్ స్ట్రోక్ తో కన్నుమూయడం తీవ్ర ఆవేదన గురిచేసిందని తెలుగు ఫిలిమ్ ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. కొమురం వెంకటేష్ మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు శ్రీ కొమరం వెంకటేష్, బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి. pic.twitter.com/Rj09xuCUrw
— Telugu Film Producers Council (@tfpcin) April 7, 2023