Beast Movie: సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాల సీజన్ మొదలైనట్లే. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతాయి. ఈ క్రమంలో ఒక్కోసారి వేరే ఇండస్ట్రీల స్టార్స్ సినిమాలు కూడా డబ్బింగ్ వెర్షన్‌లో తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు వేరే భాషల హీరోల సినిమాలు వస్తే మంచిదే. ఏ భాషలో అయినా సినిమాల పోటీ అనేది మామూలే.
ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్న విషయం ఏంటంటే.. సినిమా టికెట్ ధరలు. తెలుగు స్టార్ హీరోల పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్ ఓ స్థాయిలో ఉందంటే ఓకే.. కానీ తమిళం, కన్నడ నుండి వచ్చే డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగు పెద్ద సినిమాలకు సమానమైన టికెట్ రేట్లు ఉండటం అనేది ఏ విధంగా సరైనదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదీగాక తమిళ స్టార్ హీరో సినిమా టికెట్ రేటు.. తమిళ రాష్ట్రంలో కన్నా తెలుగు రాష్ట్రాలలో రూ. 100కు పైగా ఎక్కువ ఉండటం ఎంతవరకు కరెక్ట్?
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా.. ఏప్రిల్ 13న తెలుగులో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతోంది. తమిళనాడులో విజయ్ స్టార్డమ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ విజయ్ సినిమా టికెట్ రేటు తమిళనాడులో కంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి ఎక్కువగా ఉండటం చర్చలకు దారి తీస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బీస్ట్ సినిమా టికెట్ రేట్ల మధ్య వ్యత్యాసం తమిళనాడు – తెలుగు రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
బీస్ట్ టికెట్ రేట్లు:
చెన్నై PVR – రూ. 190.78
చెన్నై INOX – రూ. 190.78
హైదరాబాద్ PVR – రూ. 295
హైదరాబాద్ INOX – రూ. 295
ఒక తమిళ సినిమాకు తమిళనాడులో కంటే ఎక్కువ టికెట్ రేట్లకు తెలుగు ప్రేక్షకులు చూడాలా? అంటూ సినీ ప్రేక్షకులు, ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకు టికెట్ రేట్లలో ఆ స్థాయి ప్రోత్సాహం లభించిందంటే సరే. కానీ తమిళ సినిమాలకు కూడా భారీ టికెట్ ధరలు పెట్టడం అనేది కరెక్ట్ కాదని సినీవర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇక ఈ విషయంపై తెలుగు ఇండస్ట్రీ వర్గాలకు చెందినవారు సమాధానం చెప్పాల్సి ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి బీస్ట్ సినిమా తమిళ – తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నన్ను విమర్శించే హక్కు వాళ్ళకి ఎక్కడిది: ప్రియమణి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.