ఇండస్ట్రీలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారిన వారిలో యాంకర్ ప్రశాంతి ఒకరు. ఎఫైర్ సినిమాతో నటిగా మారి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ప్రశాంతి.. టాలీవుడ్ లో నటిగా అవకాశాల కోసం చాలా కష్టపడింది. కానీ.. తగినంత గుర్తింపు దక్కలేదు. ఇక అటు యాంకర్ గా టీవీ షోలలో కనిపించక, ఇటు నటిగా సినిమాలలో కనిపించక ప్రశాంతిని అందరూ మర్చిపోతున్న టైంలో ‘గృహలక్ష్మి’ సీరియల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
గృహలక్ష్మి సీరియల్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న లాస్య పాత్రతో ప్రేక్షకులను మెప్పించి, మంచి ఆదరణ సొంతం చేసుకుంది. లాస్య అంటే యాంకర్ ప్రశాంతినే చూడాలని సీరియల్ ఫ్యాన్స్ భావించేంతగా ఆమె జీవించేసింది. ఒకప్పుడు యాంకర్ గా బుల్లితెరపై అలరించిన ప్రశాంతి.. ఇప్పుడు గృహాలక్ష్మీ సీరియల్ ద్వారా నటిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. గతంలో మనసున మనసై అనే సీరియల్ కూడా ప్రశాంతి నటించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ మధ్యకాలంలో అందరు సెలబ్రిటీలు హోమ్ టూర్ అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రశాంతి కూడా తన కొత్త హోమ్ టూర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రశాంతి హోమ్ టూర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి యాంకర్ ప్రశాంతి కొత్త హోమ్ టూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.