రంగుల ప్రపంచమైన సినీ ఇండస్ట్రీలో రూమర్లకు కొదవ లేదు. నటీనటులు ఒక్కచోట కనపడితే, వారివురు రిలేషన్ లో ఉన్నారంటూ, ఏదో చేశారంటూ రకరకాల వార్తలు బయటికొస్తుంటాయి. అవి అభిమానులకు ఆనందాన్ని పంచినా, ఆ నటీనటుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. ప్రముఖ యాంకర్ ఝాన్సీ అలాంటి బాధలే అనుభవించిందట.
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ కామన్ అయినప్పటికీ, అవి నటీనటుల జీవితాల్లో అలజడులు సృష్టిస్తాయి. ఎక్కువగా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి ఇటువంటి సంఘటనల వల్ల వారి భవిష్యత్తు అంతా అంధకారంలోకి నెట్టి వేయబడుతుంది. అవకాశాలు రాక, డిప్రెషన్ కి గురై చాలా మనోవేధన అనుభవిస్తుంటారు. అలాంటి గాసిప్స్ వల్ల, అర్థం లేని రాతల వల్ల తనకు రావాల్సిన అవకాశాలు రాకుండా పోయాయని ప్రముఖ యాంకర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తూ బాధపడింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బుల్లితెరపై అలరించిన యాంకర్ ఝాన్సీ అందరికి సుపరిచితమే. సినిమాల్లో ఒక అక్కగా, చెల్లిగా, తల్లిగా పలు పాత్రల్లో అలరించిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి భర్త తో విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నప్పటికి, సినీ ఇండస్ట్రీలో తాను పడినటువంటి బాధల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఝాన్సీ ఆ బాధలన్నింటినీ చెప్పుకొచ్చింది. ఓ వెబ్ సైట్ వారు ప్రచురించిన అర్థం లేని రాతలు తనను ఎంతో మానసిక క్షోభకు గురిచేశాయని తెలిపింది. నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా.. ఝాన్సీకి ఫలానా హీరోతో ఎఫైర్ ఉందని, పోలీస్ రైడ్ లో పట్టుబడిందని వార్త రాయడం వల్ల అవకాశాలు తగ్గిపోవడమే కాకుండా ఇండస్ట్రీలో చిన్న చూపుకు గురైనట్లు వెల్లడించింది.
ఝాన్సీ మాటల్లో.. “ఓ వెబ్ సైట్ వాళ్లు యాంకర్ ఝాన్సీకి ఫలానా వారితో ఎఫైర్ ఉందని, పోలీస్ రైడ్ లో దొరికినట్లుగా కథనాలు సృష్టించారు. నిజ నిజాలు తెలియకుండా ఇలా అబాండాలు వేస్తే వ్యక్తిగతంగా ఎంత క్షోభ అనుభవిస్తామో వారికి తెలియదు. ఇటువంటి సంఘటన వల్ల తను ఓ పదవి కోల్పోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను యూనిసేఫ్ కోసం పనిచేశానని, బాల్యవివాహాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేశానని చెప్పారు. దీనికి గుర్తింపుగా యూనిసెఫ్ కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే సమయంలో యూనిసేఫ్ ప్రతినిధులు ఇటువంటి వార్తలవల్ల వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో తనకు రావాల్సిన పదవి రాకుండా పోయిందని తెలిపారు”. ఇదిలావుంటే యాంకర్ ఝాన్సీ పలు సినిమాల్లో నటించింది. తన మొదటి సినిమా ఎగిరే పావురమా తో మొదలై.. నారప్ప, వాల్తేరు వీరయ్య, ఎఫ్ 2 మల్లేశం సినిమాల్లో నటించి మెప్పించింది. యాంకర్ ఝాన్సీ వ్యాఖ్యలపై.. మీ అభిప్రయాలను కామెంట్ల రూపములో తెలియజేయండి.