ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఎవరైనా సరే తమకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బర్త్ డే వేడుకల్ని ఫుల్ కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ పుట్టినరోజు వస్తే.. సోషల్ మీడియా మొత్తం వాళ్ల ఫొటోలతో హోరెత్తిస్తుంటారు. వాళ్లతో పాటు బిగ్ బాస్ హౌసులోకి వచ్చిన పలువురు సెలబ్రిటీస్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ కూడా సదరు బర్త్ డే వేడుకల్లో తెగ సందడి చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే బోల్డ్ బ్యూటీ జ్యోతి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దీనికి పలువురు సినీ సెలబ్రిటీలు, స్టార్స్ హాజరై తెగ సందడి చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి. కామెడీ తరహా రోల్స్ మాత్రమే కాకుండా బోల్డ్ పాత్రలు చేసి కూడా ఈమె గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో తన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులని మత్తెక్కించింది. ఇక బిగ్ బాస్ తొలి సీజన్ లోనూ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పటికీ.. చాలా త్వరగా హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటిస్తూనే ఉంది. తాజాగా తన బర్త్ డే వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి టాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు వచ్చి సందడి చేశారు. జ్యోతికి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఇక రెడ్ గౌన్ లో జ్యోతి తళతళ మెరిసిపోయింది. కలర్ ఫుల్ లైట్స్ మధ్య చాలా అందంగా ఉన్న జ్యోతి.. నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఇక ఈమె పుట్టినరోజు వేడుకలకు పలువురు డైరెక్టర్స్ కూడా వచ్చి విష్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ఈమె బర్త్ డే సెలబ్రేషన్స్ లో కనిపించిన ముమైత్ ఖాన్, సంపూర్ణేశ్ బాబు తదితరులు చాలారోజుల తర్వాత మళ్లీ బయట కనిపించారు. దీంతో వాళ్ల అభిమానులు కూడా హ్యాపీగా ఫీలైపోయారు. మరి జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.