సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. విరాటపర్వం మూవీ ప్రమోషన్ల సందర్భంగా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో పాటుగా.. గోరక్షకులపై సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భజరంగ్‌దళ్ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. న్యాయ సలహాతో కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వాటిని రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
సాయిపల్లవి..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కేరళ నుంచి వచ్చినప్పటి అచ్చమైన తెలుగు అమ్మాయిలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. టాలీవుడ్‌లో లేడీ పవర్ స్టార్, నేచురల్ హీరోయిన్ అంటే సాయిపల్లవే. తన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే సాయి పల్లవి.. ఇటీవలే విడుదలైన తన సినిమా విరాట పర్వం ప్రమోషన్ల కారణంగా చిక్కుల్లో పడిపోయింది.
“విరాట్ పర్వం” మూవీ ప్రమోషన్ల భాగంగా ఓ ఇంటర్వ్యూలో కాశ్మీర్ ఫైల్స్, గో రక్షకులపై సాయిపల్లవి కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె భజరంగ్ దళ్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు.. సాయిపల్లవికి జూన్ 21వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసుల నోటీసులు రద్దు చేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయి పల్లవి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. మరి.. హైకోర్టు సాయిపల్లవి పిటిషన్ తిరష్కరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.