బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి మడివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా తేజస్వి కమిట్మెంట్ అనే సినిమాలో నటించింది. అయితే.. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటోంది తేజస్వి. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఇండస్ట్రీ, హీరోయిన్స్ కి మధ్య పరిస్థితులను చర్చించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ కమిట్మెంట్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో తేజస్వి మడివాడ పలు బోల్డ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో అడుగుపెట్టి 9 ఏళ్ళు అవుతుందని.. 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వస్తే ఇంత వరకు నాకు బ్రేక్ రాలేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక మంచి బ్రేక్ వచ్చేవరకూ ప్రయత్నం చేస్తాను.. బిగ్ బాస్ మంచి గుర్తింపు తెచ్చింది. కానీ.. సినిమాలలో మాత్రం నాకు మంచి సినిమా రాలేదు. దీంతో అందరూ అవకాశాలు లేకనే అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తానని అనుకుంటున్నారు. తాను అవకాశాలు ఉన్నప్పుడు కూడా అడల్ట్ కంటెంట్ సినిమాలు చేశానని చెప్పింది. ఆ విషయం పక్కన పెడితే.. కమిట్మెంట్ మూవీ కోసం దర్శకుడు తనను ఎలాంటి కమిట్మెంట్ అడగలేదని, ఆయన అలా చేసుంటే నటించేదాన్ని కాదని చెప్పిందట తేజస్వి. మరి తేజస్వి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.