తెలుగు ఇండస్ట్రీలో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో అల్లు అర్జున్. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో తన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. స్టైలిష్ స్టార్ డ్యాన్స్ అంటే థియేటర్లో సౌండ్ మారుమోగిపోవాల్సిందే. చాలా మంది యంగ్ డ్యాన్సర్లు స్టైలిష్ స్టార్ డ్యాన్సులపై మోజు చూపిస్తుంటారు. స్టైలిష్ స్టార్ సినిమాల్లో చేసిన డ్యాన్స్‌లు, ఫైట్లను తమ దైన స్టైల్‌లో రిక్రియేషన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా అల్లు అర్జున్ చేసిన సాంగ్ ను అచ్చుగుద్దినట్లు దించేసింది ఓ అమ్మాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాల్ చల్ చేస్తోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘డీజే (దువ్వాడ జగన్నాథం)’. ఈ చిత్రంలో ‘గుడిలో బడిలో మదిలో’ అనే పాటకు బన్నీ, పూజ వేసిన స్టెప్పులు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటను అనుకరిస్తూ ఎంతోమంది డ్యాన్స్ వీడియోలు షేర్ చేశారు. తాజాగా మృణాలి కిరణ్ అనే ఓ అమ్మాయి కూడా ‘గుడిలో బడిలో మదిలో’ పాటకు అద్భుతంగా కాలు కదిపింది.
పాటలో అల్లు అర్జున్ కనిపించిన తరహాలోనే ముస్తాబై కుర్చీలో కూర్చొని డ్యాన్స్ చేసింది. ఏక్కడా ఏమాత్రం తడబడకుండా కూల్ గా డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బన్నీని దించేశావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Loved recreating this one 🤍 @alluarjun sir’s grace in this song was so so smooth 🔥 #alluarjun #stylishstaralluarjun #alluarjundance pic.twitter.com/Tr0qF6n8Lq
— Mrinali Kiran (@KiranMrinali) October 27, 2021