విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని కూకట్ పల్లి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందగా.. వ్యక్తిగత కారణాలతో రాలేదు. దీనిపై
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లోని కూకట్ పల్లి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయడు, సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు విచ్చేసి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే సినీ పరిశ్రమ నుండి వెంకటేష్, రామ్ చరణ్, నాగ చైతన్య, అడవి శేష్, సిద్దు జొన్నలగడ్డ, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, అల్లు అరవింద్ వంటి ఘనాపాటిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయన మనవడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందగా.. వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని ఆ రోజు ప్రకటిస్తూ.. ఈ విషయం ముందుగా నిర్వాహకులకు తెలిపామని చెప్పారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంపై అనేక రూమర్లు వచ్చాయి. దీనిపై ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పర్యవేక్షించిన టీడీ జనార్థన్ సమాధానమిచ్చారు. .’చర్చ ఏం లేదు! మేం పిలిచాం. మేం ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే వారం రోజుల తర్వాత టైమ్ ఇచ్చారు. సరే అని వెళ్లి కలిసి విషయం చెప్పి ఆహ్వానించాం. అయ్యో…. ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నానని చెప్పారు అని సమాధానం ఇచ్చారు’. ఆ రోజే జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ముందస్తు ప్రణాళికలు వేసుకున్నారు. ఆ విషయాన్నే ఆయన చెప్పారు. ‘బాబూ! బర్త్ డేలు చాలా వస్తాయి. అన్నగారి సెంటినరీ (శత జయంతి) ఒక్కసారే వస్తుందని చెప్పాం. దయచేసి ఏ మాత్రం వీలున్నారండి అని చెప్పాం. ఆ రోజు ఉదయం అభిమానులకు కలవడానికి ఉంటున్నానని చెప్పారు. ఒకవేళ ఉంటే రాత్రి వరకు ఉండి… తెల్లవారు జామున బర్త్ డే చేసుకోమని నేను, రామకృష్ణ రిక్వెస్ట్ చేశాం. అయితే, ఆయనకు షెడ్యూల్ కుదరలేదేమో!? 22 మంది కుటుంబాలతో వెళుతున్నాం. ముందే అనుకున్నాను అని చెప్పారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు’ అని టీడీ జనార్థన్ వివరించారు.
హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్‌ను కూడా తాము ఆహ్వానించామని, అయితే ఆయన కూడా ఎన్టీఆర్‌తో కలిసి టూర్‌కు వెళ్ళారని టీడీ జనార్థన్ తెలిపారు. కాగా, జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు నేపథ్యంలో నందమూరి అభిమానులు కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అభిమానులు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బాలకృష్ణకు మద్దతుగా ఎన్టీఆర్ మీద విమర్శలు చేస్తుంటే… మరికొందరు వాటికి బదులు ఇస్తూ, ఎన్టీఆర్ కు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే సందర్భంలో వాళ్లు రామ్ చరణ్‌కు తమ మద్దతుని తెలియజేశారు. మరీ ఈ వివాదాలపై జూ ఎన్టీఆర్ ఏ వివరణ ఇస్తారో వెయిట్ చేయాల్సిందే.