తారకరత్న మరణ వార్త అందరినీ షాక్‌కు గురి చేయడంతో పాటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. అతడు మరణించి నెల రోజులు దాటినా ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ వార్త తారకరత్న కుటుంబానికి తీరని లోటు. అయితే ఎప్పటికప్పుడు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి, కుమార్తె నిష్క అతడి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.. తాజాగా...
ఇటీవల తెలుగు ఇండస్ర్టీ అనేక మంది దిగ్గజాలను కోల్పోయింది. దర్శకుడు విశ్వనాథ్, సాగర్, సింగర్ వాణి జయరాం, నటుడు తారకరత్న, ప్రవీణ్ అనుమోలు మృతి చెందారు. అయితే తారకరత్న మరణ వార్త అందరినీ షాక్‌కు గురి చేయడంతో పాటు నందమూరి అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. అతడు మరణించి నెల రోజులు దాటినా ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మరణం అభిమానుల కన్నా ఆ కుటుంబానికి తీరని లోటుని మిగిల్చింది. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్యా రెడ్డి.. ఆయన్ను బాగా మిస్ అవుతున్నారు. కుమార్తె నిష్క కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటున్నారు. వీరిద్దరూ తారకరత్నకు సంబంధించిన జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేస్తున్నారు.
తారకరత్న, అలేఖ్య రెడ్డిది ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. పెద్దలను ఎదరించి వీరు ఒక్కటయ్యారు. అప్పటి నుండి అతని కుటుంబం.. తల్లిదండ్రులకు, బంధువులకు దూరంగా జీవిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులకు చేరువవుతూ.. తన తాత ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో తారకరత్న కుటుంబ సభ్యులను, లోకాన్ని విడిచిపోయి వెళ్లిపోయారు. తారకరత్న చనిపోయిన తర్వాత అతడు రాసిన లవ్ లెటర్ నుండి చివరి రోజుల్లో తమతో గడిపిన మధుర జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అలేఖ్యా రెడ్డి. అదేవిధంగా తండ్రి చనిపోయిన తర్వాత నిష్క ఇన్ స్టా గ్రామ్ ఖాతాను తెరిచి, తన తండ్రితో గడిపిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.
కుప్పం వెళ్లడానికి ముందు తనతో వీడియో గేమ్స్ వీడియోను షేర్ చేశారు నిష్క. తాజాగా కుమారుడు తాన్యా రామ్.. తన తండ్రి ఫోటోను పట్టుకున్నఫోటోలను ఇన్ స్టా స్టోరీలో పంచుకున్నారు అలేఖ్య. ఇక దీనికి ‘పెద్దయ్యాక నాన్నలా అవుతాను’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా, తండ్రి చనిపోయిన తర్వాత నిష్క తప్ప మిగిలిన ఇద్దరు పిల్లలు తెరపైకి రాలేదు. తాజాగా తన కుమారుడి ఫోటోను అలేఖ్య సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అభిమానుల సైతం ఆసక్తిగా తిలకించారు. ఆ ఫోటోను చూసి అందరి హృదయాలు బరువెక్కుతున్నాయి. తండ్రి ఫొటోను పట్టుకుని ఉన్న ఈ ఫొటో కన్నీళ్లు తెప్పిస్తుంది. తారకరత్న మరణం విషయాన్ని ఆ కుటుంబం మర్చిపోలేకపోతుంది. ప్రతి రోజు అతడి జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది.