నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసి నెలరోజులు గడిచిపోయాయి. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ముఖ్యంగా తారకరత్న భార్య, పిల్లలు ఇంకా ఆయన్నే తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికీ తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసి నెలరోజులు గడిచిపోయాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అదే యాత్రలో గుండెపోటుకు గురై.. తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం అందించడానికి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ చేర్పించారు. దాదాపు 23 రోజులపాటు హాస్పిటల్ బెడ్ పై పోరాడి.. చివరికి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచాడు. అయితే, చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ముఖ్యంగా తారకరత్న భార్య, పిల్లలు ఇంకా ఆయన్నే తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. కూతురు నిష్క.. ఆయన జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా తారకరత్న కూతురు నిష్క.. తండ్రితో కలిసి చివరిసారి ఆడుకున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హిందూపూర్ కి వెళ్ళడానికి ముందురోజు తనతో కలిసి ఆడిన చివరి మూమెంట్ అని పోస్టులో ఎమోషనల్ అయ్యింది. ‘గేమింగ్.. హిందూపూర్ వెళ్లడానికి ముందు రోజు సాయంత్రం ఓబు(తారకరత్న ముద్దుపేరు)తో ‘ అని పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తండ్రీకూతుళ్ల బంధం ఇలాగే ఉంటుందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అంతేగాక తారకరత్న కూతురు నిష్క.. సోషల్ మీడియాలో పెట్టిన మొదటి పోస్ట్ ఇదే. అలాగే వీడియో గేమ్ ఆడుతున్న పోస్ట్ కాకుండా తారకరత్న, అలేఖ్య రెడ్డిలు కలిసి నవ్వుతున్న పిక్ షేర్ చేసిన నిష్క.. ‘మై పేరెంట్స్! వీళ్లే నా బలం, నా ప్రేమ’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిష్క పెట్టిన మూడు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నందమూరి ఫ్యాన్స్, ఫాలోయర్స్.. ఇకపై తల్లీకూతుళ్లు ధైర్యంగా ఉండాలని కామెంట్స్ లో సూచిస్తున్నారు. టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తారకరత్న.. ఇలా చిన్న వయసులో దూరం అవ్వడం అనేది అందరినీ బాధిస్తున్న విషయం. మరోవైపు తారకరత్న కుటుంబానికి కేర్ తీసుకుంటూ అండగా ఉంటున్నాడు బాలయ్య. మరి తారకరత్న కూతురు నిష్క పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.