నందమూరి తారకరత్న అనారోగ్యానికి గురై దాదాపు వారం రోజులు అవుతోంది. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందుతోంది. వైద్యులు ఆయనను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ వైద్యం చేస్తున్నారు. నిన్నటి వరకు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉండింది. కానీ, ఈ రోజు ఓ అద్భుతం జరిగింది. కుటుంబసభ్యులు, నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తల ప్రార్థనలు ఫలించాయి. మృత్యువు దగ్గరి వరకు వెళ్లిన ఆయన క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చారు. బాబాయ్ బాలకృష్ణ ప్రేమ ముందు మరణం కూడా వెనక్కు తగ్గింది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఆయన నూటికి నూరు శాతం సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక, తారకరత్న గుండె స్పందిస్తుందని.. మిగతా అవయవాలు కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
కాగా, శుక్రవారం నారా లోకేష్ చేపట్టిన యవగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. యాత్రకు మద్దతు తెలిపేందుకు టీడీపీ కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడవసాగారు. ఈ నేపథ్యంలోనే ఉన్నట్లుండి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శనివారం అక్కడినుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలకు తీసుకువచ్చారు. అప్పటినుంచి ఇక్కడే వైద్యం అందుతోంది. తారకరత్న ఆరోగ్యం కోసం బాలకృష్ణ తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా బిడ్డ తారకరత్నను విడిచి పెట్టలేదు. అన్ని విషయాలు ఆయనే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
నందమూరి కుటుంబసభ్యులు కూడా ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. కొంతమంది ఆసుపత్రి దగ్గరే ఉండిపోయారు. ఇక, తారకరత్న ఆరోగ్యం గురించి కర్ణాటక ప్రభుత్వం కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే ఆసుపత్రికి తగిన సూచనలు వెళ్లాయి. ఏకంగా ఆరోగ్య శాఖ మంత్రి రంగంలోకి దిగారు. కే సుధాకర్ దగ్గరుండి మరీ తారకరత్నకు అందుతున్న వైద్యం గురించి ఆరాతీస్తున్నారు. నందమూరి ఫ్యామిలీకి ఆయనకు మధ్య ఉన్న అనుబంధం కారణంగా తన కుటుంబ మనిషిలా తారకరత్నను భావిస్తున్నారు. అందుకే తారకరత్న గురించి అంతలా శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి, తారకరత్న ఆరోగ్యం మరింత మెరుగుపడాలని కోరుకుంటూ మీ ప్రార్థనలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wishing him speedy recovery 🙏
Hope everything is fine ..
Something is hitting my heart ❤️
I pray that won’t be true 🙏🙏#TarakaratnaHealthUpdate #TarakaRatna pic.twitter.com/HM5xXGu3ib— Vikas Ronanki (@VikasRonanki) January 28, 2023