సొంత అన్నదమ్ములు కాకపోయినా సోదరుల్లా కొడుకులు సోదరుల్లా ఆప్యాయంగా కలిసి మెలిసి ఉండేవారు చాలా మందే ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, వరుణ్ తేజ్, అలానే అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ తోడబుట్టిన వాళ్ళలా ప్రేమగా ఉండడం మనం చూసాం. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారకరత్నతో ఎంత ఆప్యాయంగా ఉంటారో కూడా చూసాం. తారకరత్నకు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లంటే ఎంత ప్రేమో అనేది గతంలో అయన మాటల్లోనే విన్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్ పట్ల తారకరత్నకు ఎంతో ప్రేమ, వాత్సల్యం ఉంది. తారకరత్న చివరిసారిగా ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.
సినీ నటుడు నందమూరి తారకరత్న (39) శనివారం రాత్రి కన్నుమూశారు. కుప్పం పర్యటనలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తారకరత్న కోసం బాలకృష్ణ అక్కడే ఉండి డాక్టర్లు ధైర్యం చెప్పడంతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. చికిత్స అందుతుంది, మరికొన్ని రోజుల్లో తారకరత్న క్షేమంగా తిరిగి వస్తారని అందరూ ఆశించారు. కానీ అందరి ఆశలను ఆవిరి చేస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తిరిగి వస్తారనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిని సినీ, రాజకీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. తారకరత్న మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటుని మిగిల్చింది. తారకరత్న మరణంపై నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
నటనతో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న తారకరత్న.. రాజకీయాల్లో కూడా పోటీ చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకునేలోపు ఇలా జరిగిందని అభిమానులు అంటున్నారు. కుప్పంలో పర్యటించినప్పుడు కూడా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కనిపించాయి. ఫుల్ టైం లీడర్ గా దిగాలనుకున్న సమయంలో ఇలా జరిగిందని అంటున్నారు. ఆఖరి కోరిక నేరకుండానే మరణించారని బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన చివరి మాటలను అభిమానులు గుర్తుచేస్తున్నారు. సొంత అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కానీ పెదనాన్న కొడుకులు, బాబాయ్ కొడుకులు సొంత అన్నదమ్ముల్లా ఉండడం అనేది చాలా అరుదు. సొంత అన్నదమ్ములే అంతలా ప్రేమగా ఉండడం లేదు.. కానీ సినీ పరిశ్రమలో మాత్రం అన్న కొడుకులు, తమ్ముడు కొడుకులు, చెల్లెలి కొడుకులు తోడబుట్టిన వాళ్ళలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ విషయంలో నందమూరి కుటుంబ సభ్యులు ఒక మెట్టు ఎక్కేశారు. తారకరత్నతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తారకరత్నకు ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. ఎన్టీఆర్ గురించి చివరిసారిగా తారకరత్న మాట్లాడిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.
నందమూరి కుటుంబ సభ్యులు ఎంత ఆప్యాయంగా ఉంటారో.. ముఖ్యంగా తారకరత్నకు ఎన్టీఆర్ పట్ల ఎంత ప్రేమగా, చనువుగా ఉంటారో అనే విషయాన్ని కుప్పం పర్యటనలో భాగంగా తారకరత్న వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో? ఆ బాండింగ్ ఎలా ఉంటుందో? అనే విషయాన్ని తారకరత్న ఇటీవల చెప్పుకొచ్చారు. ‘ఎన్టీఆర్ నా తమ్ముడే కదా, జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు.ప్రేమగా చూడాలి అనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ, నందమూరి రక్తం, నా తమ్ముడు. ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడు. అన్నకి తమ్ముడి మీద ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది’ అని ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తన మాటల్లో వెల్లడించారు తారకరత్న. ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన ఆఖరి మాటలు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే తారక రత్న ఇక లేరు 🥹🥹🥹#RIPTarakaRatna Garu..💔pic.twitter.com/01in0NvvlS
— Nellore NTR Fans (@NelloreNTRfc) February 18, 2023