సినిమా రంగంలో కి ఎంతో మంది నటీ, నటులుగా వెలుగొందాలని వస్తూ ఉంటారు. తమదైన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం అనుకొని సంఘటనల వల్ల అర్దాంతరంగా తమ కెరీర్ లను ముగించాల్సి వస్తుంది. అలా కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొన్న హీరోయిన్నేతనూశ్రీ దత్త.. బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ‘మీ టూ’ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. తాజాగా మరోసారి వార్తల్లో కి మరి ఆ వివరాల్లోకి వెళితే..
2018లో సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఉపిన ఉద్యమం ‘మీ టూ’. ఈ ఉద్యమానికి తెర లేపింది హీరోయిన్ తనూశ్రీ దత్త. అప్పట్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనని శారీరకంగా వేధించాడంటూ ఈమె సంచలన ఆరోపణలు చేసింది. దీంతో చాలా మంది హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను మీ టూ ద్వారా పంచుకున్నారు. దాంతో మీ టూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఆమె మరో సారి మీ టూ పై సోషల్ మీడియాలో స్పందించింది.
ఈ సందర్భంగా ఆమె పోస్ట్ లో స్పందిస్తూ..” లైంగిక వేధింపులపై మాట్లాడినందుకు ఇప్పటికీ తనని వేధిస్తున్నారని ఆరోపించింది. ‘మీటూ నిందితులు నాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. నా కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోను. మళ్లీ నటిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను’ అని పేర్కొంది. అలాగే బాలీవుడ్‌పై మహారాష్ట్ర పాత ప్రభుత్వం ప్రభావం ఎలా ఉందో ఈ సందర్భంగా వివరించింది. ‘బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్రలోని పాత పొలిటికల్ సర్క్యూట్, జాతీయ-వ్యతిరేక క్రిమినల్ ఎలిమెంట్స్ కలిసి సాధారణంగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఇలా పనిచేస్తాయి అని, వీటన్నింటి వెనుక నేను బయటపెట్టిన #metoo నేరస్థులు, NGO వారే ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని వివరించింది.
వారి తప్పు లేనప్పుడు ఇంకా నన్ను ఎందుకు టార్గెట్ చేసి వేధిస్తారు? నన్ను టార్గెట్ చేసి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడినందుకు చిన్నపిల్లలు, అమ్మాయిలను వేధించి చంపగలిగే ప్రదేశం ఇది. ఏమిటి? బాధితురాలిగా ఈరోజు నేను.. రేపు నువ్వు కూడా కావచ్చు’.. అంటూ ఆమె రాసుకొచ్చింది. ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా తాను మాత్రం భయపడనని, ఆత్మహత్య లాంటివి చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది. విటిని ఎదుర్కొనేందుకు నా ఆత్మ స్థైర్యాన్ని పెంచుకుంటానని, దాని కోసం ఆధ్యాత్మిక సాధనను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు ఆమె చెప్పింది. తెలుగులో ఈమె హీరో బాలకృష్ణ సరసన విరభద్ర అనే మూవీలో నటించింది. తాజాగా తనూశ్రీ దత్త చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.