ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్ గా ఉన్నాయి. నిత్యం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై.. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అయితే చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొడాలి సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా చంద్రబాబుపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కమ్మద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ .. సినిమాలకు సంబంధించిన పలు విషయాలను పేర్ చేసుకున్నారు. అదే సమయంలో ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కుల పిచ్చి బాగా పెరిపోయింది. కమ్మ సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు నాయుడు మేలు జరిగేలా చేశారు అంటూ వినిపిస్తోన్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ అడిన ప్రశ్నకు తమ్మారెడ్డి సమాధానం ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..” కమ్మ సామాజి వర్గానికి చంద్రబాబు నాయుడుగారు ఏదో చేసేశారనే మాటను నేను ఒప్పుకోను. ఆ సామాజిక వర్గానికి చంద్రబాబు ఏం చేశాడో నాకు తెలియదు. నాకు తెలిసి ఏమీ చేయలేదు.
నాకు జరిగిన ఓ ఘటనే అందుకు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడున్నరేళ్లు నేను ఆయనతోనే ట్రావెల్ చేశాను. రోజంతా ఆయనతోనే ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఉండేవాడిని. ఇదే సమయంలో మా అమ్మాయికి మెడికల్ సీటు కావాల్సి వచ్చింది. అప్పటికే ఆయన భారతదేశంలోనే గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఫోన్ చేస్తే మా అమ్మాయికి మెడికల్ కాలేజ్ సీటు ఇచ్చేసేవారు. మా అమ్మాయికి మెడికల్ సీటు కావాలని నేను అడిగినప్పుడు ఆయన చేయలేదు. చేయకూడదని కాదు. అలా రెండు మూడు సార్లు అడిగాను. ఆయన పెద్దగా స్పందించలేదు. తర్వాత నేను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబుకు నిజంగా కమ్మ పిచ్చి ఉండి ఉంటే.. వెంట తిరుగుతున్న నాకు చేయాలి కదా? ఆయనకున్న బిజీలో చేసి ఉండకపోవచ్చు.
ఏదీ ఏమైనా కానీ.. మీరు అనుకున్నట్లు ఆయనకు కులపిచ్చి ఉండి ఉంటే నాకు ఆ పని చేసి పెట్టాలి. మరి ఇవాళ సమాజంలోని ఇతర కమ్మకులం వారికి ఆయనేం చేశారు. ప్రస్తుతం కమ్మ వాళ్లందరూ తిట్లు తింటున్నారు. వాస్తవానికి వాళ్లల్లో ఏమీ తెలియని అమాయకులున్నారు. చంద్రబాబు ముఖం చూడని వారు, ఆయనకు ఓటు వేయని వారు కూడా ఉన్నారు. ఓ రకంగా కమ్మ వాళ్లని చంద్రబాబు తిట్టించారు. ఆయన్ని కమ్మ ద్రోహిగా తీసుకోవాలి. అనవసరంగా సామాజిక వర్గాలు ఇన్‌టెన్సివ్ అయిపోయాయి” అని భరద్వాజ తెలిపారు.