ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. గుండెపోటుకు గురవుతున్నారు. ఇక తాజాగా ప్రముఖ గాయని ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు ఒక్కొక్కరు కన్ను ముస్తున్నారు. కొందరు అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిస్తే.. మరి కొందరు తమ జీవితాలను తామే అంతం చేసుకుంటున్నారు. కొన్నిరోజుల క్రితం ప్రముఖ బుల్లితెర నటి ఒకరు ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని చాలించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆ వివరాలు..
జానపద పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న గాయని రమణి అమ్మాల్ తుది శ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా మృతి చెందారు. రమణి అమ్మాల్ రాక్ స్టార్ రమణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టేజీ షోలలో తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలిగించే ఎనర్జీ ఆమె సొంతం. ఇక గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఉండగానే మంగళవారం గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు. గాయని రమణి బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన కాదల్ చిత్రంలో తండట్టి కుప్పాయి పాటతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో భరత్, సంధ్య జోడిగా నటించారు. ఈ పాట ద్వారా వచ్చిన గుర్తింపుతో రమణికి అనేక అవకాశాలు వచ్చాయి.
ఆ తర్వాత రమణి 2017లో జీ తమిళ్ సరిగమపలో పాల్గొని మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం చెన్నైలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సినిమాల్లో ఎంత గుర్తింపు వచ్చినా ఆమె ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. చనిపోయే ముందు వరకు కూడా ఇండ్లలో పని చూస్తూ.. పొట్ట పోసుకునేది. ఇక రమణి అమెరికా, సింగపూర్, శ్రీలంక దేశాల్లో అనే స్టేజీ షోలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఒక తమిళ్ సీరియ్‌ల్లో కూడా నటించింది. రమణి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖ సంతాపం తెలిపారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇలా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూయడం.. వారి కుటుంబాలకే కాక.. అభిమానులకు, పరిశ్రమకు కూడా తీరని లోటు అంటున్నారు.