Poo Ramu Passed Away: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరో ఒకరు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మలయాళ నటుడు ఎన్‌డీ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొచ్చికి దగ్గర ఉన్న కలమస్సెర్రీలోని తన ఇంటి మందు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో నటుడు మృతి చెందటంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు ఒకరు సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. సాయంత్రానికి మృతి చెందటంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వివరాలు..
కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము సోమవారం కన్నుమూశారు. ఉదయం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన సాయంత్రానికి తుది శ్వాసవిడిచారు. పూ రాము మరణం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు, కోలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపాన్ని తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇది కూడా చదవండి: A N D Prasad: ఉరివేసుకుని ప్రముఖ నటుడు ఆత్మహత్య!
కోలీవుడ్‌లో కమర్షియల్ చిత్రాలతో పాటు సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలు.. కుల వివక్షకు సంబంధించిన చిత్రాలు ఎక్కువగానే వస్తుంటాయి. ఇలాంటి చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తూ.. పూ రాము ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రం ఏంటంటే ఆయన అసలు పేరు రాము. కానీ పూ అనే చిత్రంలో ఆయన పాత్రకు మంచి పేరు రావడంతో.. ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా స్థిరపడింది. ఇక పూ చిత్రంలో ఆయన నటన అద్భుతం అని.. ఆ పాత్రలో ఆయనను తప్ప వేరొకరని ఊహించుకోలేమని నెటిజనులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
Vera yaaru indha character la nadichi irukthalum ivlo perfect ah nadichi iruka mudiyathu… #RIP #PooRamu pic.twitter.com/qNAv28mCNe
— Dinesh Udhay (@me_dineshudhay) June 27, 2022
ఇక సూర్య హీరోగా వచ్చిన సూరారైపొట్రూ (ఆకాశం నీ హద్దురా), ధనుష్ కర్ణన్ చిత్రాల్లో కూడా పూ రాముకు మంచి పాత్రలు దక్కాయి. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.ఆకాశం నీ హద్దురా చిత్రంలో సూర్యకు తండ్రిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు ఆయన మరణంతో నాటి వీడియోలన్నీ ట్రెండ్ అవుతున్నాయి. సూర్యతో ఉన్న అనుబంధం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సూర్య నటన గురించి ఆయన గొప్పగా చెప్పిన మాటలు ఇప్పుడు ట్విట్టర్‌లో మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Nayanthara: షూటింగులో పాల్గొన్న కొత్త పెళ్లి కూతురు నయనతార!
6 விரல் வாத்தி …🥺💔#PooRamu #SooraraiPottru pic.twitter.com/6g0MCwU5Jk
— தஞ்சை அருண் (@Arun_SFC_TN49) June 27, 2022