సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా తనదైన ముద్రవేసిన వ్యక్తి మరణించారు. దీంతో ప్రతి ఒక్కరూ ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇండస్ట్రీలో విషాదం. ప్రముఖ హాస్యనటుడు మనోబాల(69) కన్నుమూశారు. దీంతో చిత్రసీమ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లిపోయింది. ఎందుకంటే సుమారుగా 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేశాడు. అలాంటి మనోబాలు.. గత కొన్నాళ్ల నుంచి కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల ఆస్పత్రిలో చేరారు. తాజాగా పరిస్థిత విషమించడంతో కన్నుమూశారు. దీంతో స్టార్ హీరోల దగ్గర నుంచి సినిమా అభిమానుల వరకు ప్రతి ఒక్కరూ సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని మరుంగూర్ లో పుట్టిన మనోబాల, కమల్ హాసన్ రిఫరెన్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు. 1979లో భారతీరాజా తీసిన ‘పుతియా వార్పుగళ్’ మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు. అదే మూవీలో పంచాయతీ సభ్యుడిగానూ చిన్న రోల్ లో కనిపించారు. అక్కడ నుంచి మొదలుపెడితే 20కి పైగా సినిమాలకు డైరెక్షన్ చేశారు. 250-300 సినిమాలు చేసిన ఈయన.. తెలుగులో చివరగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో నటించారు. ఓవరాల్ గా చూసుకుంటే.. రీసెంట్ గా రిలీజైన కాజల్ అగర్వాల్ ‘ఘోస్టీ’ లో చివరగా కనిపించారు. ఓ ఐదు సీరియల్స్ లోనూ యాక్ట్ చేశారు. ఇలా దక్షిణాదిలో చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆయన చనిపోవడం.. ప్రతి ఒక్కరినీ బాధ కలిగిస్తోంది. మీ సంతాపాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
#BREAKING : Actor / Director #Manobala has passed away sometime back..
Shocking!
RIP! pic.twitter.com/SLA2McczXY
— Ramesh Bala (@rameshlaus) May 3, 2023