ప్రముఖ బహు భాషా కథానాయిక తమన్నా లస్ట్ స్టోరీస్ పార్ట్ 2లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. లస్ట్ స్టోరీస్ 2కు ‘‘సె*క్స్ విత్ ఎక్స్’’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో తమన్నా తన అందాలకు తెర తీసేయనున్నారట. ముందెన్నడూ చూడని విధంగా బోల్డ్‌గా కనిపించనున్నారట. అయితే, తమన్నా లస్ట్ స్టోరీస్ సినిమాలో నటించటంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆమెను పొగుడుతుంటే.. మరికొంతమంది ఆ బూతు సిరీస్‌లో నటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
లస్ట్ స్టోరీస్ పార్ట్ 1 నాలుగు షార్ట్‌ఫిల్మ్‌ల సమ్మేళనంగా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్‌లు తెరకెక్కించారు. ఇందులో రాథికా ఆప్టే, భూమీ పడ్నేకర్, మనీషా కోయిరాల, కియారా అద్వానీ, అకాశ్ తోషర్, విక్కీ కౌశల్, నేహా దూపియా ప్రధాన పాత్రల్లో నటించారు. 2018, జూన్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. కాగా, తమన్నా తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. దాదాపు 15 ఏళ్లకు పైగా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. అందరు స్టార్స్‌తోనూ సినిమాలు చేశారు.
తాజాగా ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, భోలా శంకర్, దట్ ఈజ్ మహాలక్ష్మి, బోలే చుడియాన్ సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చే పాత్రలు చేస్తున్నారు. 32 ఏళ్ల ఈ మిల్కీ బ్యూటీ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలంటూ తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదన్నారు. ఒకవేళ ఆ టైమ్ వస్తే గనుక ఖచ్చితంగా తన ఫ్యామిలీ వాళ్లకి చెప్పి సంతోషంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు.
Exclusive!
Tam @tamannaahspeaks Begins Shoot For #LustStories2 🔥
Titled As #SexWithEx!🎗️
Directed By @sujoy_g!#TamannaahBhatia #Tamannaah pic.twitter.com/hwrQ87CK5f— Team Tamannaah ♥︎ (@TeamTamannaah) November 5, 2022