ఇటీవల 2023 న్యూ ఇయర్ ని సెలబ్రిటీలతో పాటు సామాన్యులు గ్రాండ్ గా పార్టీలతో సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రిటీల పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే పార్టీ మూడ్ లో పిక్స్, వీడియోలతో వార్తల్లోకెక్కింది మిల్కీ బ్యూటీ తమన్నా. పైగా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి రొమాన్స్, డాన్స్ చేస్తూ కెమెరాల కంట పడేసరికి అందరూ షాక్ అవ్వడమే కాకుండా.. ఏంటి త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అనే సందేహాలు బహిర్గతం చేసేశారు. న్యూ ఇయర్ అయితే.. బాయ్ ఫ్రెండ్ తో సెలబ్రేట్ చేసుకుంది.. కానీ, ఇంకా ఆ పార్టీ మూడ్ నుండి బయటికి రానట్లుంది తమన్నా.
ఈ భామ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని గోవాలో జరుపుకుంది. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో పాటు పలువురు ఫ్రెండ్స్ కూడా తమన్నాతో కలిసి పార్టీలో హల్చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా.. కొత్త సంవత్సరం మొదలైన ఐదు రోజుల తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు పెట్టింది తమన్నా. ప్రస్తుతం ఆ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదివరకు డ్రెస్సింగ్ స్టైల్ ని నిండుగా మెయింటైన్ చేసిన తమన్నా.. ఈ మధ్యకాలంలో హద్దులన్నీ చెరిపేసి బికినీ షో కూడా చేసేసింది. మరి గోవా బీచ్.. సెలబ్రేషన్స్ అంటే.. ఎవరికైనా అక్కడున్నంతసేపు విచ్చలవిడిగా బ్రతికేయాలని అనిపిస్తుంది.
ఇప్పుడు తమన్నా కూడా గోవాలో అదే చేస్తోందట. హాట్ హాట్ ఫోటోలు పెట్టినప్పటికీ, ఇప్పుడు రూట్ మార్చి.. ఏకంగా బీచ్ లోనే బీర్ కొడుతున్న పిక్స్, వీడియోస్ పోస్ట్ చేసింది. బీచ్ లో తమన్నా షార్ట్ జీన్స్, వైట్ షర్ట్ ధరించి.. చేతిలో బీర్ గ్లాస్ పట్టుకొని డాన్స్ చేసిన వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారింది. ఎలాగో బోల్డ్ గా ఉండటం మొదలు పెట్టింది కదా.. ఇంకా ఆపేదెవరు? అని అంటున్నారు నెటిజన్స్. పొట్టి నిక్కర్ లో.. బీర్ కొడుతున్న తమన్నా అందాన్ని ఆస్వాదిస్తూ.. ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా గుర్తుందా శీతాకాలం అనే సినిమాతో పలకరించిన తమన్నా.. ప్రస్తుతం భోళా శంకర్, బోలె చుడీయా సినిమాలు చేస్తోంది. మరి తమన్నా లేటెస్ట్ బోల్డ్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.