Tamanna: టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తమన్నా 2005లో వచ్చిన ‘‘శ్రీ’’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మిల్కీ బ్యూటీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3లో నటించారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్లలో బిజీ అయింది. ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి, తమన్నా, సునీల్, సోనాల్ చౌహాన్‌లు ‘‘క్యాష్’’ షోలో పాల్గొన్నారు. 200వ ఎపిసోడ్లో సందడి చేశారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షోలో యాంకర్ సుమతో కలిసి చిత్ర యూనిట్ రచ్చ రచ్చ చేసింది. ఈ సందర్భంగా తమన్నాకు కొంతమంది యువకులు సైతం గులాబీలు ఇచ్చి ప్రపోజ్ చేశారు. ప్రోమో చివర్లో తమన్నా ఎందుకనో ఎమోషనల్ అయ్యారు.
అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమన్నా కన్నీళ్లు పెట్టుకున్న ఈ ప్రోమో వీడియో వైరల్‌గా మారింది. మరి, తమన్నా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందో తెలియాలంటే మే 14వరకు ఆగాల్సిందే. కాగా, తమన్నా 2005లో వచ్చిన ‘‘చాంద్ సా రోషన్ చెహ్రా’’ అనే హిందీ సినిమాతో వెండి తెరపై అడుగుపెట్టారు. ‘‘హ్యాపీడేస్’’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమన్నా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బాహుబలి, అభినేత్రి, అయన్, పయ్యా, సిరుతై, వీరం వంటి సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి, ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తల్లికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన రాశీ ఖన్నా.. ధర తెలిస్తే…