మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్‌లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవలే ఎఫ్3 సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో మూడు ప్రాజెక్టుల్లో నటించగా.. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా వరుస ప్రాజెక్టుల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో టాలీవుడ్- బాలీవుడ్‌ని సమన్వయం చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం బీటౌన్ మీదే కన్నేసింది. అంతేకాకుండా ఇప్పుడు తమన్నా విషయంలో ఓ క్రేజీ వార్త వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమె బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లస్ట్ స్టోరీస్ పార్ట్ 2లో నటిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆమెకు జోడీగా విజయ్ వర్మను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
ఇప్పటికే తమన్నా- విజయ్ వర్మ మధ్య టెస్ట్ షూట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వాళ్లిద్దరూ ఎప్పుడూ కలిసి నటించింది లేదు. అందుకే ఏమైనా మార్పులు ఉంటే చేసుకునేందుకు అవకాశం ఉంటుందని.. టెస్ట్ షూట్ చేసినట్లు చెబతున్నారు. లస్ట్ స్టోరీస్ లాంటి ప్రాజెక్ట్ లో మిల్కీ బ్యూటీ లీడ్‌రోల్ అనగానే బీ టౌన్ ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువైంది.
నిజానికి బాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది లస్ట్ స్టోరీస్ అనే చెప్పాలి. అసలు కియారా అడ్వాణీకి ఇంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లస్ట్ స్టోరీస్ వల్లే వచ్చింది. నలుగురు విభిన్న నేపథ్యాలున్న మహిళల జీవితాల్లో జరిగే సాధారణ, అసాధారణ అంశాలను చెబుతూ స్టోరీ నడిపించిన తీరు అందరినీ కట్టి పడేసింది. అందుకే ఇప్పుడు పార్ట్ 2 కోసం ప్రేక్షకులు అంతలా ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా ఈ పార్ట్ 2లో ఉండే కాస్టింగ్ పేర్లు ఇంకా ఆసక్తి రేపుతున్నాయి. తెలుగులో ఇటీవలే సీతారామంతో హిట్ కొట్టిన మృణాళ్ ఠాకూర్, అంగద్ ఏబీ, నీనా గుప్లాల్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పార్ట్ 2కి ఆర్ బాల్కీ దర్శకత్వం వహించనున్నట్లు చెబుతున్నారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందో పక్కన పెడితే.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లస్ట్ స్టోరీస్ పార్ట్2లో తమన్నా నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.