ట్రోల్స్‌కి గురయ్యే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మాత్రం ఎస్. ఎస్ తమనే. ఎందుకంటే సినిమా సాంగ్ రిలీజ్ అయినా, మ్యూజిక్ బిట్ అయినా, చివరికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా సార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని చర్చకు దారి తీసింది.
తెలుగు సినీ రంగ పరిశ్రమలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ తన పంథాలో సంగీతాన్ని అందిస్తూ దూసుకు వెళుతుంటారు. ఎవరి ఖాతాల్లో వారివి బెస్ట్ కంపోజింగ్ సాంగ్స్ చాలానే ఉంటాయి. అయితే వీరిలో ఎప్పుడు ట్రోల్స్‌కి గురయ్యేది ఎవరంటే మాత్రం ఎస్. ఎస్ తమనే. ఎందుకంటే సినిమా సాంగ్ రిలీజ్ అయినా, మ్యూజిక్ బిట్ అయినా, చివరికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా సార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. ఓ సినిమా పాటను అటు తిప్పి, ఇటు తిప్పి, మరో పాటకు బీట్‌ను కంపోజ్ చేస్తారన్న అపవాదు ఉంది. గతంలో పాటను ఇలా చేశారంటూ వీడియోలను జత చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తుంటారు. అయితే అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా సంగీతాన్ని అందిస్తుంటారు తమన్.
అయితే ఇప్పుడు తమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ట్రోలింగ్స్ విషయంలో కాదండీ. తన మంచి మనస్సును చాటారు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్లకు ఓ బృందం ఉంటుందన్న సంగతి విదితమే. అయితే ఆ టీమ్‌లోని మ్యూజిషియన్ ఒకరు అనారోగ్యానికి గురయ్యారట. ఆయనకు క్యాన్సర్ రాగా, కీమో చేయాల్సి వచ్చిందట. తమన్‌కు ఈ విషయం తెలిసి ఏకంగా రూ. 10 లక్షల సాయం చేశాడట. ఈ విషయాన్ని ప్రముఖ గాయని గీతామాధురి వెల్లడించారు. ఆహాలో ప్రసారమౌతున్న ఇండియన్ ఐడల్ తెలుగు కార్యక్రమంలో ఈ విషయాన్ని గీతా మాధురి వెల్లడించారు. ఈ సాయం ఈ మధ్య కాలంలో చేసినట్లు ఆమె తెలిపారు.
క్యాన్సర్ వచ్చిన వ్యక్తిని కీమో చేస్తున్న క్రమంలో శరీరం మొత్తం కాలిపోయిందట. ఈ క్రమంలో అతనిని డిశ్చార్జి చేద్దాం అన్నా.. డబ్బులు ఇస్తే గానీ ఆసుపత్రి నుండి పంపేది లేదని చెప్పడంతో.. ఆ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారంటూ గీత తెలిపారు. అలా ఆ రోజు ఆ కుటుంబంలో తమన్ దేవుడు అయ్యారని ఆమె చెప్పారు.‘మనిషి అన్నాక ఏదైనా మంచి చేయాలి కదా. షోల ద్వారా నేను సంపాదించిన డబ్బును ఛారిటీకి ఇవ్వాలని అనుకుంటున్నాను. అదే చేస్తున్నాను’ అని చెప్పాడు తమన్. అలాగే గుంటూరులో ఓ పెద్ద అనాథాశ్రమం కడుతున్నానని. త్వరలోనే పనులు పూర్తి చేసి ఓపెన్ చేస్తానని చెప్పారు తమన్. తమన్ దాన గుణం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా ఆయనపై ట్రోల్స్ చేస్తారా..చెప్పండి అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.