ఇండస్ట్రీలో హీరోయిన్స్ లక్ ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే.. కొన్నిసార్లు డెబ్యూతోనే సూపర్ క్రేజ్ రావచ్చు.. ఇంకొన్నిసార్లు పెళ్లి అయిపోయాక కూడా స్టార్డమ్ రావచ్చు. ఏ భాషలో సినిమాలు చేసినా ఎలాంటి సినిమాలు చేశారు? అనేది ఎక్కువగా చూస్తుంటారు. 13 ఏళ్ళ క్రితం 'ఝుమ్మంది నాదం' మూవీతో తెలుగులో డెబ్యూ చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సి.. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రెచ్చిపొతోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ లక్ ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే.. కొన్నిసార్లు డెబ్యూతోనే సూపర్ క్రేజ్ రావచ్చు.. ఇంకొన్నిసార్లు పెళ్లి అయిపోయాక కూడా స్టార్డమ్ రావచ్చు. ఏ భాషలో సినిమాలు చేసినా ఎలాంటి సినిమాలు చేశారు? అనేది ఎక్కువగా చూస్తుంటారు. 13 ఏళ్ళ క్రితం ‘ఝుమ్మంది నాదం’ మూవీతో తెలుగులో డెబ్యూ చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సి.. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సక్సెస్ తో అవకాశాలు గట్టిగానే దక్కించుకుంది. కానీ.. బ్యాడ్ లక్ కొద్దీ.. సినిమాలు బాగానే చేసింది.. హిట్స్ మాత్రం పెద్దగా రాలేదు. దీంతో కొన్నాళ్లకే హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మార్చేసింది. ‘చష్మే బద్దూర్’ మూవీతో బాలీవుడ్ లో డెబ్యూ చేసింది.
ప్లేస్ మారితే లక్ కలిసొస్తుందేమో అనుకుంది కానీ.. అక్కడకూడా సేమ్ రిపీట్ అయ్యింది. వస్తున్న అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోయింది. సరిగ్గా కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లకు ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకొని.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటినుండి కథల ఎంపిక పూర్తిగా మార్చేసి.. తన నటనకు, కెరీర్ కి ఉపయోగపడే.. ఛాలెంజింగ్ గా ఉండే కథలను సెలెక్ట్ చేసుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. పూర్తిగా హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతూ.. తెలుగుతో పాటు ఇతర భాషలలో అడపాదడపా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. అయితే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రెచ్చిపొతోంది అమ్మడు.
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ నటన పరంగా కంటే ఎక్కువగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో తాప్సి ముందునుండే యాక్టీవ్ గా ఉంటోంది. అందుకు తాప్సి పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు, వీడియోలే సాక్ష్యాలుగా నిలిచాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ ఢిల్లీ సోయగం.. రెడ్ కలర్ మోడరన్ డ్రెస్ లో ఎద అందాలను ఎరగా వేస్తూ.. ఫోటో, వీడియో పెట్టింది. మరి ఆమెనే అంతలా చూపించేస్తే ఫ్యాన్స్, ఫాలోయర్స్ ఊరుకుంటారా.. వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తాప్సి గ్లామరస్ పోస్టులు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి తాప్సి అందాల విందుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.