రంగుల లోకాలంలో భారీ సంపాదన ఒకప్పుడు పెద్ద స్టార్స్ కి మాత్రమే సాధ్యం అయ్యేది. ఇక బుల్లితెరపై వెలిగిపోయేవారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. కానీ.., గత కొంత కాలంగా ఆ లెక్క మారింది. ఇప్పుడు బుల్లితెర యాంకరమ్మలు కూడా బాగానే సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్ లోనే ఉన్నారు యాంకర్ శ్యామల.
టెలివిజన్ షోలతో పాటు, ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తూ శ్యామలా బిజీగానే ఉన్నారు. ఇక అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరిసే ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి.. సొంతగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఇంతలా కష్టపడుతుంది కాబట్టే.. యాంకర్ శ్యామల తాజాగా కొత్త ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను శ్యామల తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, మరికొంత మంది సెలబ్రెటీల మధ్య ఈ గృహప్రవేశం జరగడం విశేషం.
ఇవి కూడా చూడండి:
కుర్ర హీరోయిన్లకు ధీటుగా.. స్విమ్ సూట్ లో సీనియర్ నటి-వీడియో
కమెడియన్ అలీ, యాంకర్ సుమ దంపతులు, తనీష్, గీతా మాధురి, సుహాసిని, నిరుపమ్, సింగర్ సాకేత్, అమిత్ వంటి వారు ఈ గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోషకరమైన సమయంలో కావాల్సిన వారంతా వచ్చి తమకి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉందని యాంకర్ శ్యామల తెలియచేసింది. ప్రస్తుతం శ్యామల గృహప్రవేశం వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. మరి.. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేసి.., కామెంట్స్ రూపంలో యాంకర్ శ్యామలాకి అభినందనలు తెలియజేయండి.