యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేసిన ఘటనపై యూట్యూబర్స్ అంతా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిందిగాక.. నన్ను ప్రాంక్ వీడియోలు చేయొద్దని చెప్పడానికి ఆమె ఎవరు అంటోంది యూట్యూబ్ నటి స్వాతినాయుడు. ఈ క్రమంలో స్వాతినాయుడు వీడియో ద్వారా స్పందిస్తూ కరాటే కళ్యాణిపై సీరియస్ అయ్యింది.
ఇక స్వాతినాయుడు మాట్లాడుతూ.. “గురువారం రాత్రి కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయడం చాలా తప్పు. శ్రీకాంత్ రెడ్డి తప్పుచేస్తే చట్టం ఉంది కదా.. చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టడానికి కరాటే కళ్యాణి ఎవరు? అసలు ఆమెకు సంబంధం ఏంటి? ఒకడ్ని చేసి కొట్టడం చాలా తప్పు. అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే మహిళా సంఘాలు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు అబ్బాయిలంతా అతనికి సపోర్ట్ చేయాలి కదా.. అసలు శ్రీకాంత్ రెడ్డి చేసిన తప్పు ఏంటి? సినిమాల్లో లేనిది ప్రాంక్ వీడియోల్లో ఏం ఉంది? సినిమాల్లో ఉంటే టికెట్స్ కొనుక్కుని వెళ్లి మరీ చూస్తున్నారు.
ప్రాంక్ వీడియోల్లో అంతకంటే దారుణంగా చూపించడం లేదు. కరాటే కళ్యాణికి ఏంటి ఇబ్బంది? మధ్యలో నా విషయాన్ని ప్రస్తావించింది. నన్ను వీడియోలు తీయడం ఆపేయమంటుంది. అసలు ఆమె ఎవరు నాకు చెప్పడానికి? నా లైఫ్ నాకు తెలుసు.. నేను ఒంటరిగా వచ్చాను.. ఒంటిరిగానే సంపాదించుకుని బతుకుతున్నా.. నా లైఫ్ గురించి చెప్పడానికి ఆమె ఎవరు? నీకు వీడియోలు చూడటం ఇష్టం లేకపోతే చూడటం మానెయ్.. ఈ ఇష్యూలో నా సపోర్ట్ శ్రీకాంత్ రెడ్డికే” అంటూ కరాటే కళ్యాణిపై ఫైర్ అయ్యింది. ప్రస్తుతం స్వాతినాయుడు మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.