సమాజంలో ఆడవారిపై వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వేధింపులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి ఒకరు నిర్మాతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
సమాజంలో ఆడవాళ్లకి వేధింపులు తగ్గడం లేదు. ఇలాంటి నేరాల కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. లాభం లేకుండా పోతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు వేధింపులు బారిన పడుతున్నారు. అసలు ఆడవారు బయటకు రావడమే నేరం.. వచ్చారంటే వేధింపులు తప్పవు అన్నట్లు ప్రవర్తిస్తారు కొందరు. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు లైంగిక వేధింపులకు గురవతున్నారు. కామాంధులకు కళ్లెం వేయడానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా వేధింపులను మాత్రం అరికట్టలేకపోతున్నాం. ఇక తాజాగా ప్రముఖ నటి ఒకరు సంచనల ఆరోపణలు చేశారు. నిర్మాత ఒకరు తన ఫొటోలను మార్ఫ్ చేసి.. వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..
ప్రముఖ బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ ఈ సంచలన ఆరోపణలు చేశారు. చిత్ర నిర్మాత సందీప్ సర్కార్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని.. ఆయన తన ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారంటూ స్వస్తిక ముఖర్జీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నారని.. అందులో నగ్న ఫోటోలు కూడా ఉన్నాయని స్వస్తిక తన ఫిర్యాదులో వెల్లడించింది. ఈ మేరకు స్వస్తిక గోల్ఫ్ గ్రీన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాక తనకు వచ్చిన ఈమెయిల్ కాపీలు, ఫొటోలతోపాటు ఇతర సాక్ష్యధారలతో ఈస్టర్న్ ఇండియా మోషన్ పిక్చర్స్ అసోసియేషన్‌ను సంప్రదించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం నటి స్వస్తిక ముఖర్జీ, పరంబ్రత ఛటర్జీతో కలిసి నటించిన ‘శిబ్పూర్’ సినిమాలో నటించింది. ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో స్వస్తిక చేసిన సంచలన వ్యాఖ్యలు బెంగాలీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు స్వస్తిక ఆరోపణలను నిర్మాత సందీప్ సర్కార్ ఖండించారు. దర్శకుడు అరిందం భట్టాచార్య కారణంగానే.. స్వస్తిక తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలన్ని అబద్ధమని, స్వస్తిక లాంటి నటిని తాను ప్రోత్సహిస్తానని.. ఎవరిపై ఎటువంటి నెగిటివ్ ప్రచారం చేయలేదని వెల్లడించారు.
కాగా స్వస్తిక బెంగాలీ టీవీ సిరీస్ దేవదాసితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బెంగాలీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. హేమంతర్ పాఖీ (2001), ఆమె మస్తాన్ (2004), ముంబై కటింగ్ (2008) సినిమాలతో బాలీవుడ్‌లో పాపులారిటీ పొందారు. మరి ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.