గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌పై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. దీనిపై యూపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాత్రం ప్రభుత్వంపై మండి పడుతున్నారు. నటి స్వరా భాస్కర్ కూడా యూపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసింది. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌పై మీడియా, పోలీసులు ఎదుటే కాల్పులు జరిపి.. హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన యూపీనే కాక.. దేశాన్ని కూడా కుదిపేస్తోంది. అతీఖ్ మీద కాల్పులు జరిపిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఫేమస్, సెలబ్రిటీ హోదా కోసమే తాము అతీఖ్‌ను హత్య చేసినట్లు.. పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. దాదాపు 44 ఏళ్లుగా నేర సామ్రాజ్యాన్ని ఏలిన అతీఖ్‌ను కేవలం 50 రోజుల వ్యవధిలోనే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంతమొందించింది. ఈ ఘటనపై యూపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ విపక్షాలు, కొందరు సెలబ్రిటీలు మాత్రం.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సైతం యూపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆ వివరాలు..
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మీద సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఓ అంశం మీద ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమె వివాహాం కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఆమెపై యాంటీ బీజేపి అనే ముద్ర కూడా ఉంది. సందర్భం వచ్చిన ప్రతి సారి స్వర భాస్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద నెగెటివ్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ ఘటనపై స్వర భాస్కర్ ఎంతగా హంగామా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతీఖ్ మీద కాల్పులు నేపథ్యంలో మరో సారి యూపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసింది స్వరా భాస్కర్.
అతీఖ్ అహ్మద్‌పై పోలీసులు, మీడియా ఎదుటే దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇది కూడా యూపీ ప్రభుత్వం చేసిన పనే అని అందరూ నమ్ముతున్నారు. అతీఖ్ హతం అవ్వడంతో యూపీ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ఓ రాక్షసుడు అంతం అయ్యాడని సంబరపడుతున్నారు. యూపీ సీఎం యోగిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యోగియే తమ భరోసా, భవిష్యత్తు అనుకుంటున్నారు జనాలు. అయితే కొంత మంది మాత్రం అతీఖ్ హతమైన తీరు మీద మండి పడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని.. ఎవరో ముగ్గురు వ్యక్తులు.. పోలీసులు, మీడియా ఎదుట అంత దారుణంగా కాల్పులు జరపడం.. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం విమర్శలు చేస్తున్నారు. చట్టపరంగా శిక్షించకుండా.. ఎందుకు ఇలా ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. స్వరా భాస్కర్ కూడా ఇదే విషయమై విమర్శలు చేస్తున్నారు.
‘‘చట్టం, న్యాయానికి అతీతంగా ఓ ఎన్‌కౌంటర్ జరగడం.. ఓ మనిషిని చంపడం నేరం.. అలాంటి దాన్ని సెలెబ్రేట్ చేయకూడదు. అలా జరిగిందంటే.. ఆ రాష్ట్రంలో చట్టాలు, న్యాయాలు లేవని అర్థం. వాటి మీద జనాలకు నమ్మకం పోయినట్టు.. అలాంటిది బలమైన ప్రభుత్వం అనిపించుకోదు. అది నియంతృత్వ ధోరణి అనిపించుకుంటుంది’’ అంటూ స్వరా భాస్కర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు మండి పడుతున్నారు. జరిగింది తప్పా, ఒప్పా అన్నది కాదు ముఖ్యం. జరిగిన సంఘటనపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది ముఖ్యం. రాక్షస పీడ వదిలింది అని జనాలు సంబరపడుతున్నారు. గత ప్రభుత్వాలు చట్టపరంగా శిక్షించడానికి ట్రై చేశాయి.. కానీ కుదిరిందా.. ఎప్పుడు బీజేపీ మీద విమర్శలు చేయడం కాదు.. ప్రజల గురించి కూడా ఆలోచించు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
An extra judicial killing or an encounter is not something to be celebrated. It signals a state of lawlessness. It signals that the State agencies have depleted credibility because they are acting like or enabling criminals. This is not strong governance, this is anarchy.
— Swara Bhasker (@ReallySwara) April 15, 2023