movie news : అవును వాళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయారు.. అని ఓ సినిమా టైటిల్ పెట్టి దాంట్లో హీరో, హీరోయిన్‌గా ఎవరినైనా పెట్టాలనుకుంటే.. సుస్మితసేన్, ఆమె మాజీ ప్రియుడు రోహ్‌మన్ షాల్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. కొన్ని నెలల క్రితం విడిపోయిన ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ కలిపోయారు. చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇలా బ్రేకప్ చెప్పుకున్నాక కలిసిన జంటలు బాలీవుడ్‌లో చాలా అరుదు. అలాంటి అరుదైన జంటల్లో సుస్మితసేన్, రోహ్‌మన్‌ల జంట చేరిపోయింది. తాజాగా, వీరిద్దరు ఓ బిల్డింగ్‌లోంచి బయటకు వచ్చి అభిమానులతో కలిసి ఫొటోలు దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
బ్రేకప్‌కు కొన్ని నెలల ముందు ఎంత సంతోషంగా ఉన్నారో అంతే సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. డ్రెస్ కోడ్ కూడా వాడారు. అభిమానులు సుస్మితను చుట్టుముడుతున్న సమయంలో రోహ్‌మన్ రంగంలోకి దిగి, ఆమెను తన బాహువుల్లో ఉంచి రక్షణగా నిలిచాడు. అనంతరం ఆమెను సేఫ్‌గా కారులోకి ఎక్కించాడు. ఈ ఒక్క దృశ్యం చాలు వీరిద్దరూ మళ్లీ బంధంలో హ్యపీగా ఉన్నరని చెప్పటానికి అంటున్నారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి : మనోజ్ హైయర్ పర్పస్ కామెంట్లపై స్పందించిన నాగబాబు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.