ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు వెండితెరపై ఎంతో గొప్పగా అలరిస్తున్నా.. రియల్ లైఫ్ లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేధికగా చెబుతున్నారు. ఇప్పటికే సమంత, మమతా మోహన్ దాస్, నయనతార, నయనతార ఇలా ఎంతో మంది సినీ తారలు అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ మద్య కాలంలో స్టార్ హీరో, హీరోయిన్లు వ్యాధుల భారిన పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు తమకు అరుదైన వ్యాధి ఉన్నదని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేధికగా తెలుపుతున్నారు. ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడున్నానని సమంత తెలిపింది. మాలీవుడ్ బ్యూటీ మమతా మోహన్ దాస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో బాధపడుతున్నానని.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ సుష్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.
1994లో విశ్వ సుందరి గా కిరీటాన్ని దక్కించుకున్న సుస్మితా సేన్ తర్వాత హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించింది. బాలీవుడ్ లో స్థిరపడ్డా ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇటీవల సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన విషయం స్వయంగా ఇన్ స్ట్రాలో వేధికగా వెల్లడించింది. ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్ కి తరలించగా వైద్యులు శస్త్ర చికిత్స చేసి స్టంట్ వేసినట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సుస్మితా సేన్ తన ఆరోగ్యంపై ఇన్ స్ట్రా వేధికగా అప్ డేట్ ఇచ్చింది. తాను యాంజియోప్లాస్టీ చేయించుకోవల్సి వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని.. తాను క్షేమంగా రావాలని ప్రార్థించిన అభిమానులకు.. రాత్రి, పగలు తనకోసం కష్టపడిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది.
‘ఇటీవల నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.. గుండెకు సంబంధించిన 95 శాతం ప్రధాన రక్తనాళాలు ముసుకు పోవడంతో ఒక్కసారిగా కూప్పకూలిపోయాను.. నన్ను ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ వైద్యులు, సిబ్బంది ఎంతో కష్టపడి నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ విషయం నా కుంటుంబ సభ్యులుకు.. ఆప్తులకు మాత్రమే తెలుసు. నేను చికిత్స పొందే సమయంలో ఎవరికీ చెప్పాని భావించలేదు. కోలుకున్న తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. నా పోస్ట్ చూసి అభిమానుల, ఆత్మీయులు ఎంతోమంది స్పందించారు. నేను నేను క్షేమంగా రావాలని ప్రార్ధించిన అభిమానులకు నా ధన్యవాదాలు. త్వరలో ఆర్య – 3 షూటింగ్ లో పాల్గొని మీ ముందుకు వస్తా’ అంటూ ఇన్ స్ట్రా వేదికగా చెప్పుకొచ్చింది. ఆర్య -3 వెబ్ సీరీస్ లో నటిస్తుంది.. తన పిల్లల కోసం పోరాడే ఓ తల్లిగా ఇందులో కనిపించబోతుంది.